మహబూబ్‌నగర్

అక్టోబర్ నాటికి ఓడీఎఫ్‌గా జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23: వచ్చే అక్టోబర్ నాటికి జిల్లాను బహిరంగ మల మూత్రవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అవశ్యకత, వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని నాగనూలులో ఉన్న కేజీబీవీ పాఠశాలలో మరుగుదొడ్ల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని వివిధ అంశాలపై విద్యార్థులకు వివరించారు. కేజీబీవీ పాఠశాలలో, హస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ముఖ్యంగా బాలికలు తమ తల్లిదండ్రులకు మరుగుదొడ్లు నిర్మించాలని, వినియోగించాలని కోరుతూ జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో లేఖలు రాసే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. తాము హాస్టళ్లలో మరుగుదొడ్లను వినియోగించుకుంటున్నామని, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరుగుదొడ్డినే వినియోగించుకుంటామని, ఇందుకు వెంటనే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని ప్రతి బాలిక తల్లిదండ్రులకు లేఖ రాస్తున్నారని వివరించారు. విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్లినప్పుడు మరుగుదొడ్ల అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అప్పుడే వందకు వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అందులో భాగంగానే మరుగుదొడ్ల నిర్మాణం వినియోగమని అన్నారు. విద్యార్థులు జీవితంలో గెలవాలంటే తొలిమెట్టు విద్యార్థి దశలోనే ఉంటుందన్నారు. పరీక్ష సమయంలో ఇష్టపడి శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ డబ్ల్యూవో ప్రియాంక, డీఆర్‌డీవో సుధాకర్, ఎంపీడీవో పండరీనాథ్, స్వచ్ఛ భారత్ జిల్లా ప్రెరక్ శరత్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా బాశెట్టి
వనపర్తి, ఫిబ్రవరి 23: బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వనపర్తికి చెందిన బాశెట్టి శ్రీనివాసులును నియమించారు. నియామక పత్రాన్ని శుక్రవారం జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి బాశెట్టికి అందజేశారు. ఈ సందర్భంగా బాశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంపిక చేసినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు, నాయకులు రావుల రవీంధ్రనాథ్ రెడ్డి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, సబ్బిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
వనపర్తి, ఫిబ్రవరి 23: ఈ నెల 24న రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి తెలిపారు. ఉదయం 9 గంటలకు వీపనగండ్ల మండల కేంద్రం చేరుకొని అక్కడ మార్కెట్ గోదామును ప్రారంభిస్తారని, అక్కడి నుండి పాన్‌గల్ మండల కేంద్రం చేరుకొని అక్కడ వ్యవసాయ మార్కెట్ గోదామును ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయిపల్లి గ్రామాల్లో సాయిబాబ దేవాలయాన్ని సందర్శిస్తారని కలెక్టర్ తెలిపారు.