మహబూబ్‌నగర్

శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23: జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షణలో ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ కోరారు. శుక్రవారం ఉదయం అంబేద్కర్ కాలనీలో పోలీసులు కార్డాన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విలేఖరులతో ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో దొంగతనాలు జరుగుతుండడం, అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుండడంతో కార్డాన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటారని, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారనే విషయాన్ని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. పోలీసులు చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎలాంటి పరిచయంలేని వారికి ఇండ్లను అద్దెకు ఇవ్వవద్దని, సరైన ఆధారాలు చూపించినప్పుడే ఇండ్లను కిరాయికి ఇవ్వాలని ముఖ్యంగా వారి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని తీసుకోవాలన్నారు. అపరిచితులకు, ఎలాంటి ఆధారాలు లేని వారు ఇండ్లలో ఉండి ఏదైనా నేరాలకు పాల్పడితే ఆ ఇంటి యజమానులు ఇబ్బందులకు గురవుతారన్నారు. కొత్త వ్యక్తులు కాలనీలలో వస్తు విక్రయాల కోసం వచ్చినట్లే వచ్చి ఇండ్లను పరిశీలించి రెక్కీ నిర్వహిస్తున్నారనిన్నారు. తాళాలు ఉన్న ఇండ్లను, చిన్న పిల్లలు, ఒంటరి మహిళలు ఉన్న ఇండ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కాలనీలలో కొత్త వ్యక్తులు కనిపించిన అనుమానంగా ఉన్న వెంటనే పోలీసులు సమాచారం అందించాలన్నారు. ఎలాంటి డక్యూమెంట్‌లేని వాహనాలను నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డాన్ సర్చ్ ద్వారా ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. కార్డాన్ సర్చ్ సందర్భంగా స్వాధీనం చేసుకున్న వాహనాలకు యజమానులు తమ వద్ద ఉన్న ధృవపత్రాలను చూపి తీసుకొని వెళ్లాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు రవికుమార్, లక్ష్మీనారాయణ, శంకర్ పాల్గొన్నారు.

2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పతనం
- బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్
కోస్గి, ఫిబ్రవరి 23: రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పతనం ఖాయమని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ జోస్యం చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంలోని షాదీఖానాలో జరిగిన శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను సైతం ఇక్కడున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం తామే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కంకణబద్ధులై కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి నాలుగు బూత్‌లకు ఒక శక్తి కేంద్రం ఇన్‌చార్జీని నియమించామన్నారు. ప్రతీ శక్తి కేంద్రం ఇన్‌చార్జీ అహర్నిశలు శ్రమిస్తే 2019లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురడం ఖాయమని తెలిపారు. ఇప్పటికే పాలమూరు జిల్లాలో 500 మందిని శక్తి కేంద్రాలకు నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటయ్య, బీజేపీ తాలుకా ఇన్‌చార్జి మదన్, నాయకులు నారాయణ, వెంకటనరసింహులు, శ్రీకాంత్, వెంకటరాములు, జైపాల్, భాస్కర్ పాల్గొన్నారు.