మహబూబ్‌నగర్

కమ్యూనిటీ పోలీస్‌తో 15వేల నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఫిబ్రవరి 23: కమ్యూనిటీ పోలీసు ద్వారా జిల్లాలో త్వరలోనే 15వేల ఉద్యోగాల నియమాకాలు చేపడుతామని జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. శుక్రవారం ఎస్పీ అనురాధ మక్తల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ మక్తల్ పోలీసుల పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. వందశాతం వరకు పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆమె సూచించారు. మేము సైతం కార్యక్రమంలో భాగంగా కైరోజ్ ఆర్గనైజేషన్ సహకారంతో తెలంగాణ జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో పోలీసుశాఖతో పాటు ఇతర శాఖల్లో వారివారి నైపుణ్యతను బట్టి రూ.15వేల ఉద్యోగాల నియమాకాలు భర్తీ చేస్తామని చెప్పారు. పోలీసుశాఖలో పోలీసులతో సహ ఇతర విభాగాలకు గాను 280 మందిని ఎంపిక చేసి వారికి ఉచిత వసతి, భోజనంతో రెండునెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. అందుకోసం నిధులు కూడా మంజూరైనట్లు ఆమె తెలిపారు. నిరుద్యోగులకు సదవకాశమని వారు తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుకున్న యువత సంఘ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు ఇతర వ్యసనాలకు అలవాటు పడకూడదన్న ఉద్దేశంతో పోలీసుశాఖ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలీసులు కల్పిస్తున్న అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కాగా పట్టణాలతో పాటు పల్లెల్లోను సిసికెమెరాలను ఏర్పాటు చేయాలన్నదే తెలంగాణ పోలీసు లక్ష్యమని అన్నారు. మక్తల్ పట్టణంలో ప్రస్తుతం 30 సీసీ కెమెరాలు ఉన్నాయని ఈ ఏడాది చివరినాటికి 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందుకోసం నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. కళాశాలలు, పాఠశాలలు, ఫంక్షన్‌హళ్లు, కాలనీలు, వ్యాపార సముదాయాల వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. అందుకుగాను కాలనీలవారిగా స్థానిక పోలీసులు సమావేశాలు నిర్వహించి ఆయా ప్రాంతాల ప్రజల సహకారంతోనే సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఎక్కడ ఏ సంఘటన జరిగిన తక్షణమే తెలియడం జరుగుతుందని తద్వారా నేరాలను అదుపు చేయవచ్చని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 20 మంది పోలీసులు చేసే పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది చివరినాటికి మక్తల్‌లో 500 సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.