మహబూబ్‌నగర్

దేశ సమగ్రత కాంగ్రెస్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 28: దేశ సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడం ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం ఎందరో కాంగ్రెస్ వాదులు తమ ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం అనంతరం కూడా దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజా సేవలో ప్రాణాలను పోగొట్టుకున్న మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలని వారు చూపిన అడుగుజాడల్లో సోనియాగాంధీ కూడా దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని త్యాగాలకు ఆమె కూడా ప్రతీకగా నిలిచారని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమం కోసం యుపిఏ ప్రభుత్వ హయంలో దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కూలీలకు చేతి నిండ పని కల్పిస్తూ వారికి రెండు పూటల భోజనం దొరికేలా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రపంచ రాజ్యాల సరసన భారతదేశాన్ని చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు హితోధికంగా కృషి చేశాయని అన్నారు. మాజీ డిసిసి అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ మాట్లాడుతూ 131 ఏళ్ల పార్టీ సుదీర్ఘ చరిత్రలో ఎందరో మహనుభావులు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల ద్వారా ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, డిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాసాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే లౌకికత్వానికి నిదర్శనమని దేశ ప్రజలందరినీ ఒకే భావనతో చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ప్రస్తుతం జాతీయ స్థాయిలో అధికారంలో లేనంత మాత్రన ఏమీ కాదని, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సంగతి కాంగ్రెస్ నాయకులు గమనించాలన్నారు. దేశ రాజకీయల్లో మళ్లీ కాంగ్రెస్‌దే హవా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని భవిష్యత్ అంతా కాంగ్రెస్‌దేనని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారావు, పటేల్ వెంకటేష్, అల్తాప్ హుస్సెన్, లక్ష్మణ్‌యాదవ్, అంజయ్య, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, మజీద్, ఉస్మాన్ ఖాద్రీ తదతరులు పాల్గొన్నారు.