క్రైమ్/లీగల్

గోకుల్‌నగర్‌లో యువకుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మార్చి 6: భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నడనే నెపంతో ఓ భర్త యువకుడిని కత్తితో పొడిచి చంపిన సంఘటన అచ్చంపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సీఐ రామకృష్ణ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట పట్టణం గోకుల్‌నగర్ కాలనీకి చెందిన పుట్ట సైదులు (22) అనే అవివాహితుడు పట్టణంలో వాటర్ బండిపై డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఇంటి పక్కన అదే కాలనీకి చెందిన ఓ మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నడనే నెపంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ విభాగంలో దినసరి కూలీగా పనిచేసే భర్త గణేష్ మధ్యాహ్నం కొబ్బరి బోండాలు వలిచే కత్తితో పుట్ట సైదులును అతి దారుణంగా నరికి హత్య చేశాడు. దీంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులకు విషయం తెలయడంతో సీఐ రామకృష్ణ, లింగాల ఎస్‌ఐ విష్ణు చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని సివిల్ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.