మహబూబ్‌నగర్

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మార్చి 13: గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శే్వతామహంతి అన్నారు. కేంద్రాల ద్వారా అందించే రేషన్, గుడ్లు, పాలు, లబ్ధిదారులే వినియోగించుకునేలా అంగన్‌వాడీ టీచర్లు పనిచేయాలన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో పెబ్బేరు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లతో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులందరు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి అక్కడే పౌష్టికాహారం తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లకు తీసుకేళ్లేందుకు అనుమతించరాదని స్పష్టం చేశారు. పేదరికం, ఇతర కారాణాల వల్ల గర్భిణిలు, పిల్లలు, బాలింతలు ఇండ్లలో సరైన పౌష్టికాహారం తీసుకోరన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలలో తేడా రాకుడదని, గుడ్లు, రేషన్ వంటి వాటిలో తేడాలు వస్తే సంబంధిత అంగన్‌వాడీ టీచర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాజరు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లలో తేడాలు ఉండరాదన్నారు. ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైతే రికవరీ చేస్తామని హెచ్చరించారు. సోషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్యచిదాంబి మాట్లాడుతూ గర్భిణిల ఆరోగ్యం బాగుండాలంటే అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి తినాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వరప్రసాద్, పెబ్బేరు సిడిపివో తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం
మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆదేశం
మహబూబ్‌నగర్, మార్చి 13: జిల్లాలో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ సమావేశ మందిరంలో తహసిల్దారులు, సర్వేయర్లు, వివిధ శాఖల అధికారులతో ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ ప్రాజెక్టుల క్రింద భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు ఇంకా పరిహారం క్రింద ప్రభుత్వం రూ.35కోట్ల నిధులను కేటాయించాల్సి ఉందని, ఈ నిధులు మంజూరైన వెంటనే భాధితులకు నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణం తలపెట్టిన ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని తీగలపల్లి బండ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖానాపూర్ పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొల్లూరులో 111 ఎకరాల భూసేకరణ కావాల్సి ఉండగా ఎందుకు ఆలస్యం జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. నవాబుపేట 96 ఎకరాల భూమి పెండింగ్‌లో ఉండేందుకు గల కారణాలు, కారుకొండలో 300 ఎకరాల భూమి పెండింగ్‌లో ఉందన్నారు. భూసేకరణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలో ఐటి కారిడార్ పేపర్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని అధికారులను అడిగారు. పోలేపల్లి, జడ్చర్లలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భీమా ప్రాజెక్టు క్రింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేసి పనులను ప్రారంబించాలన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా 170 ఎకరాల భూసేకరణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆనంద్‌కుమార్, రైల్వే ఈఈ సుభాకర్, ఏఈ చిన్న పుల్లారెడ్డి, భూపాల్‌రెడ్డి, రవీందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.