మహబూబ్‌నగర్

ఆధార్ ఇస్తేనే కొత్త పట్టదారు పాసు పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 13: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వనున్న కొత్త పట్టదారు పాసు పుస్తకాలకు సంబంధించి రైతులు ఆధార్ కార్డు నంబర్‌ను తప్పనిసరిగా రెవెన్యూ అధికారులకు ఇవ్వాలని లేకపోతే పట్టదారు పాసుపుస్తకం రాదని జిల్లా కలెక్టర్ ఈ. శ్రీ్ధర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో భూ రికార్డుల ప్రక్షాళనపై మండలాల వారిగా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఈ. శ్రీ్ధర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 78 శాతం రైతుల ఆధార్ నంబర్లు అనుసంధానం చేయడం జరిగిందని మిగత వాటిని కూడా పూర్తి చేయాలన్నారు. ఆధార్ నంబర్ ఇస్తేనే కొత్త పట్టదారు పాసుపుస్తకాలు వస్తాయనే విషయాన్ని రైతులకు వివరంచాలని సూచించారు. భూ రికార్డుల పరిశీలన బాగా చేసినప్పటికి గతంలోని తప్పులు పునరవృతం కాకుండా పాసు పుస్తకంలోని విరరాలు సరిగా నమోదు చేయాలని లేకుండా ఇబ్బందులు పడుతారని హెచ్చరించారు. పాసు పుస్తకాలలో నమోదుకు ముందే మరోసారి సరి చూసుకోవాలని పంపిణీ తర్వాత సమస్యలు వస్తే డిజిటల్ సంతకం చేసిన తహశీల్దార్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఏయే మండలాలలో పాసుపుస్తకాల పంపిణీ సమయంలో తక్కువ సమస్యలు వస్తాయో వారే బాగా పనిచేసినట్లవుతుందన్నారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం క్షేత్ర స్థాయిలో భూమి పైన సర్వే జరుగుతుందని అప్పుడు రైతులకు తప్పని సరిగా బ్యాంక్ ఖాతా ఉండాలని, పంట పండించిన వారికే పెట్టుబడి డబ్బులు వస్తాయన్నారు. గతంలో ఏవైన తప్పులు చేసి ఉంటే సరి చేసుకోవాలని సూచించారు. మార్చి చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సురేందర్‌కరణ్, డీఆర్వో మధుసూధన్‌నాయక్‌తో పాటు జిల్లాలోని ఆర్డీవోలు, తహాశీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.