మహబూబ్‌నగర్

వ్యవసాయ వ్యర్థాలతో పుష్పాల తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, మార్చి 13: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా మహిళల ఉపాధికి వ్యవసాయరంగ వ్యర్థ పదార్థాలతో పుష్పాలు తయారు చేసే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మిరాకిల్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ ఎండీ జావిద్ అన్నారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి విలేఖరితో ఆయన మాట్లాడుతూ నాబార్డ్ సౌజన్యంతో మిరాకిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అలంపూర్ మండల పరిధిలో ఎల్‌ఈడీపీ (లైలి హుడ్ ఎంటర్‌ప్రైజ్ డెవవలప్‌మెంట్ ప్రోగ్రామ్)లో 103 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటి దాక రెండు గ్రూపుల మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు, ప్రస్తుతం చివరి గ్రూపు మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా మహిళలకు వ్యవసాయరంగా వ్యర్థపదార్థాలతో డ్రైప్లవర్, హ్యాండిక్రాఫ్ట్ తయారీపై శిక్షణలు ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తయారీ ఉందని, తమిలనాడు, కేరళలో అక్కడక్కడ శిక్షణా కేంద్రాల్లో తయారీ ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా అలంపూర్‌లోనే శిక్షణ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. యూనిక్ ఐటమ్ అని ఇంత వరకు ఎక్కడ తయారీ కాలేదని, ఎవరు శిక్షణ ఇవ్వలేదని, ఎవరు నేర్చుకోలేదని దీనికి మంచి డిమాండ్ ఉందని ప్రసిద్ధిగాంచిన టూరిస్ట్ క్షేత్రం కావడంతో శిక్షణ పొందివారు మార్కెటింగ్ చేసుకోవచ్చని అన్నారు. ఈశిక్షణ ద్వారా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాంక్ లింక్ ద్వారా రుణాలు కల్పించి, ఉత్పత్తికి సంబంధించి మార్కెటింగ్ చూపించడం జరుగుతుందన్నారు. 15 రోజులకు ఒక గ్రూపు చొప్పున మూడు గ్రూపులకు గాను రెండు గ్రూపులకు శిక్షణ ఇవ్వడం పూర్తయిందన్నారు. చివరి గ్రూపునకు శిక్షణ ఇవ్వడం, శిక్షణ తీసుకొన్న వారికి ఎగ్జిబిషన్‌కు కూడా టిఎ, డిఎలు ఇచ్చి పంపుతామన్నారు. శిక్షణ తీసుకొన్నట్లు డెవలప్‌మంట్ కమిషన్ హ్యాండిక్రాఫ్ట్, ఢిల్లీ నుండి ఒక అర్టిజన్ గుర్తింపుకార్డు కూడా ఇప్పించడం జరుగుతుందన్నారు. దాని ద్వారా లేపాక్షి, గోల్కోండ ఎగ్జిబిషన్‌లో ఉచితంగా స్టాల్ దొరుకుతుందని, రూ.2లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయన వెంటా ఇన్‌స్ట్రక్టర్ మమ్మద్ఫ్రీ, మహిళ సమాఖ్య సిబ్బంది విజయలక్ష్మీ తదితరులు ఉన్నారు.

ఎస్పీ బదిలీ వెనుక రాజకీయ కుట్రలు
- ప్రభుత్వం బదిలీని విరమించుకోవాలి
- ప్రజా సంఘాలు విజ్ఞప్తి
గద్వాల, మార్చి 13: జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ బదిలీ వెనుక రాజకీయ కుట్రలు విన్నాయని, ప్రభుత్వం ఎస్పీ బదిలీని విరమించుకోవాలని అఖిలపక్షం కమిటీ, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఎస్పీ విజయ్‌కుమార్ ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చి జిల్లాలో మార్పు తీసుకవచ్చారన్నారు. జిల్లాలో తనదైన ముద్రవేసి దోపిడీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, కాల్‌మనీ, ఇసుకమాఫియా, నకిలీ విత్తనాలు, బెట్టింగ్ రాయుళ్ల భరతం పట్టారని కొనియాడారు. యువత చెడు మార్గంలో నడవకుండా తన దైనశైలీలో మార్పు తీసుకవచ్చారని పేర్కొన్నారు. గత నాలుగు నెలల క్రితం ఎస్పీ విజయ్‌కుమార్‌ను బదిలీ చేయడానికి డీల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, సోషల్‌మీడియా ఈ ప్రయత్నాలను నిరసిస్తూ తీవ్ర నిరసనలు వ్యకమయ్యాయని, ఇవన్ని గాలి వార్తలని రాజకీయ నాయకులు కొట్టిపారేశారని వారు ఆరోపించారు. నడిగడ్డలో తన దైన పాలనతో ప్రత్యేక ముద్ర వేసుకొని సామాన్యులకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చి ముందుకు వెళ్లుతున్న ఎస్పీని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం బదిలీ చేయడం సమంజసం కాదని వారు మండిపడ్డారు. జిల్లాలో ఎస్పీ ఉన్నంతవరకు తమ ఆటలు సాగవని కొందరు రాజకీయ నేతలు కుట్రలు పన్నారని, అలాంటి నేతలకు ప్రజలు త్వరలో బుద్ధిచెబుతారని వారు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఎస్పీని జిల్లాకు తీసుకరావాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వామి, ఆంజనేయులు, కోళ్ల హుస్సేన్, బోరవెల్లి రాములు, రంజిత్‌కుమార్, అచ్చనగౌడ్, ధరూర్ రవి, మున్నా భాషా, తదితరులు పాల్గొన్నారు.