మహబూబ్‌నగర్

భగ్గుమన్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 13: రాష్ట్ర శాసనసభలో జరిగిన ఘనపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసభసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన దాడిని సీరియస్‌గా తీసుకుని ఏకంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాశ్వతంగా వారి ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆందోళనకు దిగారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు ప్రభుత్వం ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసిన వారిలో ఉన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై కూడా ప్రభుత్వం వేటు వేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు ఖంగుతిన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వచ్చిన తమ నిరసనను తెలియజేశారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఎక్కడిక్కడ రాస్తారోకోలకు దిగడంతో వాహనాల రాకపోకలను ఇబ్బందులు ఏర్పడ్డాయి. నియోజకవర్గ కేంద్రాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించగా పోలీసుల అరెస్టులను సైతం నిరసిస్తూ పోలీస్ స్టేషన్లలోనే కాంగ్రెస్ నాయకులు బైఠాయించి ధర్నాలకు దిగారు. జిల్లావ్యాప్తంగా ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో ఊరేగింపుగా వచ్చిన వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్, రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ సమయంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న సందర్భంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొంతు నొక్కడం ఏమిటని ప్రజాస్వామ్యాన్ని ముక్యమంత్రి కాలరాస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెనహర్, లక్ష్మణ్‌యాదవ్, కట్టా రవికిషన్‌రెడ్డి, రావూప్ పాల్గొన్నారు.

15 వేల జనాభా మించితే
నగర పంచాయతీ
* వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్
మహబూబ్‌నగర్, మార్చి 13: పదిహేను వేల జనాభాకు మించి ఉన్న గ్రామ పంచాయతీలను నగర పాలక సంస్థలుగా గుర్తిస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నగరాల్లో నివసించే జనాభా 45 శాతానికి చేరుకుందని తెలిపారు. ఇది జాతీయ నగర జనాభా కంటే అధికంగా నివసించే వసతులు, వౌలిక సదుపాయాలు మెరుగైన రీతిలో ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను 51 జీఓ ద్వారా జారీ చేయడం జరుగుతుందని అన్నారు. తదనుగుణంగా జిల్లా కలెక్టర్లంతా జిల్లా కేంద్రాలను జాయింట్ కలెక్టర్లు ఇతర సినియర్ అధికారులకు ఇతర నగర పాలికలు, మున్సిపాలిటీలను కేటాయించి మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారుల సమన్వయంతో మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు చేపట్టి నగరపాలిక, మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికలకు అనుగుణంగా సంబంధింత శాసన సభ్యులు, ఎంపీలతో చర్చించి తయారు చేయాలని అన్నారు. మూడు నాలుగురోజుల్లో పురపాలిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సమర్పించాలని ఆదేశించారు. ఈ పనులకై కేటాయింపు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా కేటాయిచడం జరుగుతుందన్నారు. పురపాలిక కౌన్సిల్‌కు నిధులు సంబంధం ఉందని మిషన్ భగీరథ ద్వారా నీటి సౌకర్యం కల్పించడం అవుతుందని మిగిలి పనులకు అన్ని కూడళ్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం, పార్కులు చెరువులు, శ్మశాన వాటికలు, మార్కెట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు తయారు చేసి అమలు పరచాలని అన్నారు. ఈ డిసెంబర్‌లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.