మహబూబ్‌నగర్

ప్రజాసమస్యలపై ఉద్యమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, మార్చి 14: రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నియంత పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వంపై ఉద్యమిద్దాం అని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ అన్నారు. బుధవారం దేవరకద్ర మండల కేంద్రంలోను మండలశాఖ తరపున బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షుడు ఎగ్గని నర్సింహులు ఆధ్వర్యంలో మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రి వారి ద్వారా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, కన్వీనర్ రవిందర్‌రెడ్డి వైద్యశిబిరంలో పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శాంతికుమార్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతగానో ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ముందుకు ఉద్యమాలు చేపడుతామన్నారు. కేంద్రం నిధులతో రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేసి అధికారంలోకి వస్తామన్నారు. కేసీఆర్ అవినీతి అసమర్థత పాలన కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం రూ.50వేలకోట్లు, ఎస్టీలకు 30వేల కోట్లకు పైగా వారి సంక్షేమం కోసం కేటాయించిందన్నారు. లక్ష కోట్లకుపైగా వ్యవసాయ రంగంకు నిధులు కేటయించిందన్నారు. పేద ప్రజలకు 5లక్షల బీమా వర్తింపజేసిందన్నారు. ఇక కేసీఆర్ పతనం ప్రారంభమైందని, మోదీ చేపడుతున్న పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తున్నారని 2019లో రాష్ట్రంలోను కేంద్రంలోను బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిరాజ్, యజ్ఞ్భాపాల్‌రెడ్డి, ఉశన్న, తిరుపతి, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు
* బస్తీల్లో బలోపేతం
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్
మహబూబ్‌నగర్, మార్చి 14: తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం రానుందని అందుకు బస్తీల్లో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విదాలుగా కృషి చేయడం జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డు, పట్టణం సమీపంలోని వివిధ గ్రామాల్లో టీడీపీ నాయకులు పర్యటించారు. బసిబస్తీకి తెలుగుదేశం కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ బొయపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా 34వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపి జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా నిలిచే పార్టీ అని అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్న వారు పార్టీని నమ్ముకుని కష్టపడుతున్నారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తుందన్నారు. అన్ని పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతామన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందని అందుకు నిదర్శనం బస్తిబస్తీకి పసుపు జెండా కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 34వ వార్డులో జరిగిన కార్యక్రమానికి వచ్చిన ప్రజల స్పందననే అని అన్నారు. కొన్ని సందర్భాలలో కొందరు నాయకులు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయినంత మాత్రం నష్టం ఏమి లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలన్నారు. కాంగ్రెస్. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను ఎదుర్కొనే సత్తా కేవలం తెలుగుదేశం పార్టీకే ఉందని, కార్యకర్తల పట్టున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వర్‌రెడ్డి, జయశ్రీ, ఎన్‌పి.వెంకటేష్, షౌకత్‌అలి, హరికృష్ణ, మాల్యాద్రీ, యాదగిరి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.