మహబూబ్‌నగర్

గద్వాల ఎస్పీకి జనం నీరాజనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టు, మార్చి 14: జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ను బదిలీ చేయోద్దంటూ జనం నీరాజనాలు పలుకుతున్నారు. నడిగడ్డ యువత, బీసీ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం గట్టు మండల కేంద్రంలో ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్పీ, నకిలీపాస్ పుస్తకాలు, బెట్టింగ్, కాల్‌మనీ, నకిలీ విత్తనాలు, కల్తి దందాలు, గుండాయిజం తదితర ఎన్నో అన్నాయాలపై ఉక్కుపాదం మోపి సామాన్య ప్రజలకు నేనున్నానని గుండె ధైర్యం ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నిరుద్యోగ యువతకు మార్గదర్శితో ఆత్మ విశ్వాసం కల్పించి, దళిత, బడుగు, పేద ప్రజలకు ధైర్యం ఇచ్చిన వ్యక్తిని జిల్లా ప్రజలకు దూరం చేయటం భరించలేమని, సీఎం కేసీఆర్ జిల్లా ఎస్పీ బదిలీని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు రామనాయుడు, వీరేష్ నాయుడు, యువత తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ బదిలీని విరమించుకోవాలి
అఖిలపక్షం నాయకుల డిమాండ్
గద్వాల: ఎస్పీ విజయ్‌కుమార్ బదిలీని ప్రభుత్వం విరమించుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ భవన్‌లో నాగర్‌దొడ్డి వెంకట్రాములు ఆధ్వర్యంలో అఖిలపక్షం కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అఖిలపక్షం కమిటీ నాయకులు మాట్లాడుతూ నీతికి నిజాయితికి మారు పేరైనా జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ను జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి బదిలీచేయడం విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త జిల్లాకు ఎస్పీగా వచ్చినప్పటి నుంచి అనేక వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేశారని, అందుకే బదిలీ చేయించారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. సామన్య ప్రజలకు అందుబాటులో ఉన్న వారి సమస్యల పట్ల శ్రద్ధ వహిస్తూ భరోసానిస్తుండటంతో ప్రజలు తమ భయాన్ని తొలగించుకొని సమస్యలను నాయకుల వద్దకు కాకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్న సమయంలో ఎస్పీ బదిలీని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఎస్పీ విజయ్‌కుమార్ అధిక వడ్డీ వ్యవస్థను, కల్తీ మందులు, కల్తీ విత్తనాలను అరికట్టే ప్రయత్నం చేశారని, సీడ్ మాఫియా, నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణాలను రట్టు చేశారని తెలిపారు. ఎస్పీ బదిలీని విరమించుకోవాలని సీఎం, హోంమంత్రికి వినతిపత్రాలు అందజేయాలని అఖిలపక్షం నాయకులు నిర్ణయించారు. ఈనెల 15న జిల్లా కేంద్రంలోని టీఎన్‌జిఓ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అన్ని పార్టీల నాయకులు, యువత, విద్యార్థి, ప్రజా సంఘాలు, కార్మిక, సామాజిక, కుల సంఘాల నాయకులు ఈర్యాలీలో పాల్గొని తమ ఆవేదనను తెలంగాణ ప్రభుత్వాన్నికి తెలియపరిచి ఎస్పీ బదిలీని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు వెంకటస్వామి, ఆంజనేయులు, అచ్చనగౌడ్, గణేష్, బాలగోపాల్ రెడ్డి, కోళ్ల హుస్సేన్, వాల్మీకి, బోరవెల్లి రాములు, ఆటో మక్బూల్, వివి నర్సింహ, ఉప్పేరు నర్సింహ, ధరూర్ రవి, ఉప్పేర్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు.