మహబూబ్‌నగర్

అందరి చూపు అలంపూర్ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 14: రాష్ట్ర రాజకీయాలు వేడ్కెడటంతో ఆ ప్రభావం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో గల అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. రాష్ట్ర శాసన సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు దాడికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం ఏకంగా ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని చకచకగా ఎన్నికల కమిషన్‌కు గెజిట్ విడుదల చేసి పంపారు. దాంతో కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా జిల్లావాప్తంగా మొదటి రోజు ధర్నాలు రాస్తారోకోలు జరిగినప్పటికిని బుధవారం సైతం అదే తరహాలో ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు శ్రీకారం చుట్టారు. అయితే ఆందోళనలు ఎలా ఉన్నప్పటిని అందరి దృష్టి మాత్రం అలంపూర్ నియోజకవర్గంపై పడింది. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యం అని రాజకీయ విశే్లకులు భావిస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే సందర్భంలో అలంపూర్ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తాయనే ప్రచారం అప్పుడే ఊపందుకుంది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లు ప్రభుత్వంపై దూకుడునే ప్రదర్శించారనే ప్రచారం కూడా ఉంది. పలు సందర్భాల్లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా సంపత్‌కుమార్ ఘాటైన విర్శలు సైతం చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇలా జరగడంతో అసలు సంపత్ రాజకీయ భవితవ్యంపై ఆయన ముఖ్య అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలంటూ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయేనని కూడా అప్పుడే చర్చ మొదలైంది. కాగా గాంధీభవన్‌లో ధర్నాకు దిగిన సంపత్‌కుమార్‌కు మద్దతు పలికేందుకు జిల్లా నుండి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్తారని సమాచారం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అర్థరాత్రి నుండే అరెస్టులు చేస్తూ పోలీసులు హల్‌చల్ సృష్టించారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో అర్ధరాత్రి నుండి పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కాగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాత్రం పోలీసులకు దొరకకుండా ఉదయం 11 గంటల సమయంలో ఒకసారిగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగి వందలాది మందితో రాస్తారోకో చేశారు. వెంటనే పోలీసులు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు ముత్యాల ప్రకాష్, సంజీవ్ ముదిరాజ్, బెనహర్, విఠల్‌రెడ్డి, పాష, రాములతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దాదాపు వందమందికి పైగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల తమ అరెస్టులు చేయడం అంటే రాష్ట్రంలో పోలీసులు రాజ్యం నడుస్తుందని డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ ఆరోపించారు.