క్రైమ్/లీగల్

యువకుని హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దమందడి, మార్చి 16: మండల పరిధిలోని బల్జిపల్లి ఆమ్లె ఎర్రగడ్డ తండాలో గత మూడు సంవత్సకాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మరో యువకుడు గురువారం రాత్రి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. దుండగులు హత్య అనంతరం మృతదేహాన్ని సమీపంలోని చెరువు కట్టపై పూడ్చిపెట్టారు. ఎస్‌ఐ లెనిక్ కథనం ప్రకారం.. ఎర్రగడ్డ తండాకు చెందిన రవినాయక్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుండి ముంబాయిలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వాడు. తల్లి దండ్రులు ఇద్దరు చనిపోవడంతో బాబాయి శంకర్ దగ్గర ఉంటున్నాడు. ముంబాయిలోని ఇంటి విషయమై ఎర్రగడ్డ తండాకు చెందిన లోక్యాతో గొడవపడి అతని హత్య చేసిన కేసులో రవి నిందితునిగా ఉన్నాడు. ఈ సంఘటనలో రవి జైలులో కూడా ఉండి ఇటీవలే విడుదలయ్యాడు. చెల్లెలు సునీత పెళ్ళి సంబంధం కోసం గురువారం ముంబాయి నుండి రవి ఎర్రగడ్డతండాకు వచ్చాడు. గురువారం రాత్రి బాబాయి శంకర్ ఇంటి ముందు రవి నిద్రిస్తుండటంతో ఇదే అదునుగా భావించిన గతంలో రవి చేతిలో హత్యకు గురైన లోక్య తండ్రి గోవింద్, హుమ్లనాయక్, సిత్యనాయక్ ముగ్గురు వ్యక్తులు రవిని అతి కిరాతకంగా బండరాయితోమోది హత్య చేసి మృతదేహాన్ని కుంటకట్ట సమీపంలో పాతిపెట్టారు. అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి హత్య చేసినట్లుగా ఒప్పుకుని లొంగిపోయారు. రవి బాబాయి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని ఏఎస్పీ సురేందర్‌రెడ్డి, కొత్తకోట సీఐ సోంనారాయణసింగ్, ఎస్‌ఐ లెనిన్ గౌడ్‌లు సందర్శించి సంఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు.