మహబూబ్‌నగర్

పారని కృష్ణమ్మ.. ఆగని వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 19: నిజాం ప్రభుత్వ కాలంలో జిల్లా కేంద్రంగా ఉన్న నాగర్‌కర్నూల్ రాష్ట్రాల పునర్విభజన అనంతరం పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా ఉన్న నాగర్‌కర్నూల్ గత రెండేళ్ల నుంచి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ఈ జిల్లా అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉంది. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం ఆ తరువాత అవి నీటిమీద బుడగల్లా మిగిలిపోతున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని రకాల వనరులు ఉన్నప్పటికి వాటిని వినియోగంలోకి తేవడంలో పాలకులు పూర్తిగా విఫలంకావడంతో ఈ ప్రాంత ప్రజలకు స్థానిక ఉపాధిలేక ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసపోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే నెలలో స్వగ్రామాలకు రావడం, దసరా పండుగ తరువాత వలసపోవడం జరుగుతుంది. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న ఈ ప్రాంత ప్రజలు స్వచ్ఛమైన తాగునీటిని తాగలేకపోతున్నారు. అనేక గ్రామాల్లో ఫ్లోరైడ్ నీరు ప్రజలను పీడిస్తున్నది. సాగునీరులేక వర్షంపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న కేఎల్‌ఐ పథకం మూడు లిప్టుల ద్వారా నీటిని వదిలినప్పటికి, పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు జరగలేదు, ఒకటి, రెండు మోటార్లతో నీటిని పంపింగ్ చేసి కొన్ని చెరువులను నింపారేగాని నేటికి డిస్ట్రిబ్యూషన్ కాలువలు పూర్తి కాలేదు, ప్యాకేజీ 29లో అనేక చోట్ల స్ట్రక్చర్ల నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇది ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు పిల్ల కాలువ ద్వారా సాగునీరు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. విద్యారంగంలో ఈ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. పార్లమెంట్‌లో ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో రైల్వేచార్జీలపై ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటే ఈ ప్రాంత ప్రజలు మాత్రం మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాచర్ల-రాయిచూర్ రైల్వేమార్గానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ మార్గం చేపడుదామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, ముఖ్యమంత్రి పరిశీలనలో ఉంది. గత నలభై ఎళ్లు కావస్తున్న అది నిరాశగానే ఉండిపోయింది. కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ల ప్రజలకు రైలు ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో కొల్లాపూర్, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ సెగ్మంట్‌లలో 65 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీటిలో ఎక్కువగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ముంపునకు గురైనవారికి అన్నిరకాలుగా ఆదుకుంటామని ప్రభుత్వలు హామీ ఇస్తున్నప్పటికి వాటిని ఆచరణలో పెట్టడంలేదు. పాలకులు మారుతున్నప్పటికి మా గోడును ఎవరు పట్టించుకోవడంలేదని, జీఓ 98ని జారీ చేసినప్పటికి అమలులో సరైన శ్రద్ధ చూపడంలేదని ముంపునకు గురైన ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఈ జీఓ ఆధారంగా కర్నూల్ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలలో అర్హులైన వారందరికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినప్పటికి జిల్లాలో మాత్రం ఇంత వరకు ఇవ్వలేదని ఆ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంత నేతలు అభివృద్ధివైపు దృష్టిని కేంద్రీకరిస్తారనే ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు రాష్ట్ర మంత్రిగా, వనపర్తి నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండటంతో ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తారనే ఆశాభావంతో ప్రజలు ముఖ్యంగా యువకులు ఉన్నారు.