మహబూబ్‌నగర్

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, మార్చి 19: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాగర్‌కర్నూల్ జిల్లా డీఆర్‌ఓ, ఇన్‌చార్జి విద్యాధికారి మధుసూదన్‌నాయక్ హెచ్చరించారు. సోమవారం చారకొండ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంతో పాటు తుర్కలపల్లి, తిమ్మాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, జూపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి మధుసూదన్‌నాయక్ వేర్వేరుగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా తుర్కలపల్లి ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయురాలు కవిత, బాలాజీలు పాఠశాలకు హాజరుకాలేదు. జూపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్‌రావు తన అనుమతి లేకుండా మరో ఉపాధ్యాయుడు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాయిపల్లిలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు అరుణ, నిర్మలలు ఆలస్యంగా రావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తుర్కలపల్లిలో ముగ్గురు. తిమ్మాయిపల్లిలో ఇద్దరు, జూపల్లిలో హెచ్‌ఎంలకు షోకాజులు జారీ చేయనున్నట్లు తెలిపారు. వీరందరిపై క్రమ శిక్షణ చర్యలకు కలెక్టర్ సిఫారసు చేయనున్నట్లు, వారంతా స్వయంగా కలెక్టర్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విధుల పట్ల అలసత్యం ప్రదర్శిస్తే చూస్తు ఊరుకోమని, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కొల్లాపూర్‌లో సబ్‌జైల్ నిర్మిస్తాం
- జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య
కొల్లాపూర్, మార్చి 19: పట్టణంలో గతంలో నిర్మాణం చేపట్టి అగిపోయిన సబ్‌జైల్ నిర్మాణం పనులు పూర్తి చేసి సబ్‌జైల్‌ను నిర్మిస్తామని తెలంగాణ జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని జమ్మి చెట్టు సమీపంలో ఉన్న సబ్‌జైల్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. నగర పంచాయతీ, భవన నిర్మాణం కోసం రూ.50లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నారని ఇట్టి నిర్మాణం పనులను తక్షణమే ఆపి వేయాలని ఆయన కోరారు. జైళ్ల శాఖ ఎలాంటి ఆదేశాలు లేకుండా, స్థలాన్ని బదాలాయింపు లేకుండా నగర పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు. గతంలో సిబ్బంది కొరత కారణంగా సబ్‌జైల్ నిర్మాణం పూర్తి చేయాలేకపోయామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తి సిబ్బంది స్థాయిలో సబ్‌జైల్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట పోలీస్ సీఐ శ్రీరాం సైదయ్య, ఎస్సై వెంకసత్యనారాయణ తదితరులు ఉన్నారు.