మహబూబ్‌నగర్

యుద్ధ ప్రాతిపదికన భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుచ తలపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌లు ప్రత్యేక శద్ధ కనబరుస్తున్నారు. పథకం అమలులో భాగంగా జడ్చర్లలో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పైప్‌లైన్ల ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వేసవిలో జిల్లాలోని ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా నీటిని సరఫరా చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన పనుల నిర్వహణలో పూర్తిగా నిమగ్నమైంది. జిల్లాలోని 483 హ్యాబిటేషన్లకు జడ్చర్ల డబ్ల్యుటీపీ ద్వారా తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాంరెడ్డిగూడెం వద్ద నిర్మించిన డబ్ల్యుటీపీకి కృష్ణానది నుండి విడుదల చేసిన నీరు నేడో, రేపో చేరుకుంటుంది. అదేవిధంగా జడ్చర్ల డబ్ల్యుటీపీకి కూడా గుడిపల్లి నుండి నేరుగా నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులు చివరి దశకు చేరుకున్నాయి. బిజినేపల్లి, వట్టెం గ్రామా మధ్యగల కెనాల్ దగ్గర 200 మీటర్ల పైప్‌లైన్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ పైప్‌లైన్ నిర్మాణాన్ని కొనసాగించి జడ్చర్లకు ఈ నెలఖారులోపే నీటిని తీసుకువచ్చి డబ్ల్యుటీపీకి సమీపంలో గల 31 గ్రామాలకు తాగునీటి సరఫరాచేసి పనులను పరిశీలించనున్నారు. చుట్టుపక్కల గల గ్రామాలకు తాగునీరు సక్రమంగా సరఫరా అయితే వెంటనే మూసాపేట మండలంలోని పలు గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. అనంతరం జిల్లాలోని మిగితా గ్రామాలకు కూడా దశల వారిగా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించి నిర్ణీత కాలంలో జిల్లాలోని గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చాలా సంవత్సరాలుగా మహబూబ్‌నగర్ జిల్లాలో అనేక గ్రామల ప్రజలు తాగునీటి సమస్యతో వేసవి కాలంలో తలడిల్లుతుంటారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలు పరస్తుండటంతో ఈ ఏడాది నుండి సమస్య తీరే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ కూడా తాగునీటి కోసం బిందెలు చేత పట్టుకొని కిలోమీటర్ల తరబడి వెళ్లకూడదని ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. ఆయన ఆశయాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జిల్లాలోనే అమలు చేసి ముఖ్యమంత్రి చేత ప్రశంసలు పొందాలని మంత్రి లక్ష్మారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌లతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుంది. జడ్చర్లలో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ పుల్లారెడ్డి ఆంధ్రభూమితో మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నందున పనుల నిర్వహణలో సంబంధిత సిబ్బంది తలమునకలై ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నిరంతరం పనులు కొనసాగుతున్నందున నిర్ణీత కాలానికే తాగునీరు గ్రామాలకు సరఫరా అవుతుందని ఆయన వెల్లడించారు.

వందల తాటి, ఈత చెట్లు అగ్నికి అహుతి
* చారకొండలో ఉపాధి కోల్పోయిన కార్మికులు
* తప్పిన ప్రాణపాయం
వెల్దండ, మార్చి 20: అసలే మండుతున్న ఎండలు, ఎండలకు తోడు ఆకస్మికంగా ఒక్కసారిగా చెలరేగిన మంటలకు కూడుపెట్టే వందల తాటి, ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గౌడ కులస్థులకు తమ కళ్ల ముందే నిత్యం స్వచ్ఛమైన కల్లు నిచ్చే చెట్లు మంటల్లో బుగ్గిపాలై ఉపాధి కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. చారకొండ మండల కేంద్రంలో మంగళవారం తాటి వనంలో గుర్తు తెలియని వ్యక్తులో, రైతులో తమ అవసరాల కోసం నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు అది దావానంగా మారి 40 ఫీట్ల ఎత్తులో ఉండే తాటి చెట్లు, ఈత చెట్లకు మంటలు వ్యాపించడంతతో వందలాది చెట్లు బుగ్గిపాలయ్యాయ. ఎకరాల్లో తాటి, ఈత వనంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. దీనితో కల్వకుర్తి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటాహుటిన చేరుకోని మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు గంటలకు పైగా విశ్వప్రయత్నలు చేశారు. వీరికి తోడుగా కార్మకులు వాటర్ ట్యాంకర్లును పెట్టి నీళ్లు చల్లడంతో మూడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. స్తానిక ఎస్‌ఐ పోచయ్య, స్థానిక గౌడ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకోని మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కాగా చారకొండ గ్రామంలో ఎక్కువ మంది గీత వృత్తిపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. ఉదయానే్న వెళ్లి కల్లు గీసిన కార్మికులు సాయంత్రానికి అవి బుగ్గిపాలైన దశలో చూసి బోరున విలపించారు. ముఖ్యంగా మంటలు చెలరేగుతున్న సమయంలో గీత కార్మికులు కొందరు చెట్ల ప్రాంగణంలో ఉన్నారు. మంటలు చెలరేగడాన్ని ముందుగా గ్రహించిన మరికొందరు కార్మికులు అప్రమత్తమై కేకలు వేయడంతో వారంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ విపత్తులో వందలాది తాటి, ఈత చెట్లు అగ్నికి అహుతవగా మరికొన్ని చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తాటి, ఈత చెట్లు కోల్పోయి ఉపాధి కోల్పోయిన గీతా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ గౌడ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం
* కూర్చిమీద కూర్చోబెట్టిన ఉద్యోగులను విస్మరించడం దారుణం
* 25న ముఖ్యమంత్రి దిమ్మతిరిగేలా భారీ బహిరంగసభ
* టీఎన్‌జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్
మహబూబ్‌నగర్, మార్చి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని నాలుగేళ్ల తన పరిపాలనలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని టీఎన్‌జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ ఆరోపించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో టీఎన్‌జిఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణరావు అధ్యక్షతన ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే సకల ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డితో పాటు వివిధ ఉద్యోగుల సంఘాల రాష్ట్ర నేతలు హాజరయ్యారు. ఈ సన్నాహక సమావేశంలో టీఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ఉద్యోగులు ఎంతో త్యాగాలు చేశారని ఉద్యమ సమయంలో ఉద్యోగుల జేబు నుండి ఖర్చు చేసి టెంట్లు వేస్తే టీఆర్‌ఎస్ నాయకులు ఆ టెంట్లల్లోకి వచ్చి ప్రసంగించి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం చేసింది ఉద్యోగులు అయితే టీఆర్‌ఎస్ నాయకులు కూర్చీలో కూర్చున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలన్ని పరిష్కారం అవుతాయని భావించి 44నెలల పాటు ఓపికగా ఉన్నామన్నారు. ఈ నెల 25న జరిగే ఉద్యోగుల బహిరంగసభకు జిల్లా నుండి వేలాదిగా తరలిరావాలని ఆ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల సత్తా ఏమిటో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. 2019 ఎన్నికల్లో తామే మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఉద్యోగుల సహకారం లేకుండా కేసీఆర్ మళ్లీ సీఎం పీఠం ఎలా కూర్చుంటారో తెల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉద్యోగులు గోసపడుతున్నారని విమర్శించారు. సీపీఎస్‌పై ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ కేంద్రం చేతుల్లో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బహిరంగసభను విజయవంతం చేసి కేసీఆర్ కళ్లు తెరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చందర్‌నాయక్, శ్రీనివాస్, చెన్నకిష్టన్న, సాయిలు, మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

17 పురావస్తు వెండి నాణేలు లభ్యం
ఆత్మకూర్, మార్చి 20: మండలంలోని కత్తెపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం వ్యయసాయ పొలంలో పురావస్తు వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఆత్మకూర్ సీఐ శంకర్, తహశీల్దార్ జీకే మోహన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కత్తెపల్లి గ్రామ శివారులోని బొగ్గులోని గుట్ట పరిధిలో సర్వే నెంబర్ 123లో నల్లగొండ జిల్లాకు చెందిన రైతు దేవళ్ళ నారాయణరావుకు చెందిన వ్యవసాయ పొలం చదును చేస్తుండగా పురావస్తుకు శాఖకు చెందిన 17 వెండి నాణేలు బయటపడ్డాయ. వెండి నాణేలు బయటపడినట్లుగా గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం వాటిని స్వాధీనపరుచుకున్నారు. కాగా మూడు రోజుల వరకు నాణేలు బయటపడ్డ విషయాన్ని గ్రామ రెవెన్యూ సిబ్బంది తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం పట్ల సీఐ, తహశీల్దార్‌లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వ్యవసాయ పొలంలో లభించిన 17 వెండి నాణేలను పంచనామా నిర్వహించిన అనంతరం ఆత్మకూర్ తహశీల్దార్‌కు అందజేసినట్లుగా సీఐ శంకర్ తెలిపారు.