మహబూబ్‌నగర్

120 శాతం లక్ష్యం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మార్చి 21: ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ, స్ర్తినిధి ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వవలసిన రుణాలు ఇవ్వడంలో 120 శాతం లక్ష్యం సాధించాలని కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ సెర్చ్ ఏపీఎంలను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో పీడీ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సెర్ప్ ఉద్యోగులతో బ్యాంకు లింకేజీ, స్ర్తి నిధి లక్ష్య సాధనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి మండల ఏపీఎంను, క్లస్టర్ కోఆర్డినేటర్లను ఇప్పటి వరకు ఎంత లక్ష్యం సాధించారు, పూర్తిస్థాయి లక్ష్యం ఎందుకు సాధించలేకపోయారని వివరాలు అడిగారు. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. బ్యాంకుల నుండి ఏమైనా సమస్యలుంటే ఎల్‌డీఎం దృష్టికి తీసుకురావాలని, ఇంకా పెండింగ్‌లో ఉన్న లక్ష్య సాధనకు డాక్యుమెంటేషన్ తయారు చేసి బ్యాంకులకు సమర్పించాలన్నారు. ఇంకా కొత్తగా వచ్చే మహిళలతో కొత్త మహిళాసంఘాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సెర్ప్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పీడీ డీఆర్‌డీఏ అనంతరెడ్డి, ఎల్డీఎం రవీందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మోదీ పాలనతోనే దేశం సుభిక్షం
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి
కొత్తకోట, మార్చి 21: మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం కొన్నూరు గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక సంస్కరణలు చేపట్టి ఇటు రైతులకు అటు బలహీన వర్గాల వారి కొసం పథకాలను ప్రవేశ పెట్టారని, బేటి బచావో బేటి పడావో , ఫజల్‌బీమాయోజన వంటి పథకాలను, సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అనంతరం వివిధ పార్టిలకు చెందిన 300 మంది కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎగ్గని నర్సింహులు, మాధవరెడ్డి, బాబుగౌడ్, శ్రీనివాస్, కృష్ణయ్యయాదవ్, రవికుమార్‌గౌడ్, మదు, ఆంజనేయులు, రవిగౌడ్, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఎత్తివేయాలి
* పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి
ధన్వాడ, మార్చి 21: మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలలో పేపర్ లీకేజీ సంఘటనలో విధులు నిర్వహిస్తున్న 13 మంది ఉపాధ్యాయులుపై పెట్టిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్‌టీయూ అధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణగౌడ్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రవేట్ పాఠశాలలకు చెందిన వ్యక్తులు లీకేజీలకు పాల్పతే ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఎత్తిచూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 13మంది ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఘటనపై పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి మాట్లాడుతామని, అనంతరం కేసులు ఎత్తివేయని పక్షంలో దశలవారిగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మరికల్ మండల పీఆర్‌టీయూ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ, సభ్యులు నాయిమ్‌సిద్దిక్‌ఖాన్, బాలలింగయ్య, లక్ష్మీయ్య, సదన్‌రావు, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.