మహబూబ్‌నగర్

కార్యకర్తలకు అండగా నిలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 21: టీఆర్‌ఎస్ నాయకుల దౌర్జన్యాలకు భయపడేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ యువనేత సురేందర్‌రెడ్డిలు అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండల పరిధిలోని దాచక్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా దాదాపు 100 మందికిపైగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నేత సురేందర్‌రెడ్డి ఆద్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు దాచక్‌పల్లిలో కాంగ్రెస్ జెండాను డీసీసీ అధ్యక్షుడు అవిష్కరించారు. ఈసందర్భంగా దాచక్‌పల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కేసీఆర్ మోసం చేస్తుంటే ఆయన పార్టీ నాయకులు మాత్రం గ్రామాల్లో దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. వారి దౌర్జన్యాలకు, ఆగడాలకు భయపడేది లేదని వాటిని అడ్డుకుని తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. వచ్చే కాలంలో కాంగ్రెస్‌కు మంచిరోజులు ఉన్నాయని దాచక్‌పల్లి ఇందుకు ఆదర్శమని వందమందికిపైగా ఈ చిన్న గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభసూచకం అన్నారు. కాంగ్రెస్ నేత సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ హన్వాడ మండలంలో టీఆర్‌ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు అధికంగా ఓట్లు వేశారని అయితే ఓట్లు వేసిన ప్రజలనే ఇక్కడి నియోజకవర్గ ప్రజాప్రతినిధి అణగదొక్కడానికి చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ రైతులకు మరింత భారంగా మారిందని విమర్శించారు. బ్యాంకుల్లో రైతులను నమ్మే పరిస్థితి లేకుండా చేశారని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షీప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడంలో దాదాపు రెండు సంవత్సరాలకుపైగా ఆలస్యం అవుతుందని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ కోటా కింద అన్ని మండలాలకు జడ్పీ నిధులు వెళ్తే ఒక్క హన్వాడ మండలానికి నిధులు ఆగిపోవడం ఏమిటని నిలదీశారు. ఈ విషయాన్ని హన్వాడ మండల ప్రజలకు వివరిస్తామని టీఆర్‌ఎస్ నాయకుల ఆగడాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. కార్యక్రమంలో హన్వాడ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, నాయకులు సంజీవ్‌ముదిరాజ్, సత్యం, లింగంనాయక్, అనంతరెడ్డి, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, దాచక్‌పల్లి కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

నేడు నాగర్‌కర్నూల్‌లో పుస్తక ప్రదర్శన
- ప్రారంభించనున్న కలెక్టర్
నాగర్‌కర్నూల్, మార్చి 21: జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో మొట్టమొదటి సారిగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహకారంతో స్పర్ష సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు పి. నర్సింహా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ ప్రారంభిస్తారని, ఈ పుస్తక ప్రదర్శనలో వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతోపాటు పోటీ పరీక్షలకు సన్నధమయ్యే అన్ని విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయన్నారు. పుస్తక ప్రియులకు ఇది మంచి అవకాశమని, సాహిత్యాభిమానులు, ఉపాధ్యాయులు, భాషా పండితులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆదరించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఐదురోజుల పాటు నిరంతరంగా పుస్తకావిష్కరణలు, చర్చాగోష్ఠులు, కళా ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన వారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.