మహబూబ్‌నగర్

భగీరథతో నీటి కష్టాలు తీరినట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 21: మిషన్ భగీరథతో జిల్లాలో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరినట్లేనని మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల పరిధిలోని వెలికిచెర్ల గ్రామసమీపంలో దేవరకద్ర నియోజకవర్గానికి ఎల్లూరు రిజర్వాయర్ నుండి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు సంబంధించిన మిషన్ భగీరథ నీటిని కలెక్టర్ రోనాల్డ్‌రోస్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మంచినీటి కోసం జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతుండేవారని రాష్ట్ర ప్రభుత్వం గొప్పమనస్సుతో శాశ్వతంగా మంచినీటి ఎద్దడిని నివారించడానికి దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని అవాసాలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలాలను అందించడానికి పనులన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఎల్లూర్ రిజర్వాయర్ ద్వారా దాదాపు నాలుగైదు పంప్‌సెట్ల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు వెల్కిచర్లలో గేట్‌వాల్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడి నుండి జిల్లాకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గానికి ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఏప్రిల్ మొదటి నుండే అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ శుద్ధజలాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ రెండుమూడు రోజుల్లో ఎక్కడైన పైప్‌లైన్ పనులు గ్రామాల్లో పెండింగ్‌లో ఉంటే త్వరితగతిన పూర్తి చేసి వాటర్‌ట్యాంకులకు లింక్‌చేసి ఈ నీటిని ట్యాంక్‌లకు ఎక్కించేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను శాశ్వతంగా పారదోలడానికి మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి మహిళల ఇబ్బందులను తీర్చారన్నారు. గత 30-40 ఏళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు మంచినీటి కోసం బిందెలు పట్టుకుని కిలో మీటర్ల మేర వెళ్లేవారని రాత్రిపగలు తేడా లేకుండా వ్యవసాయ పొలాలకు వెళ్లి ప్రమాదాలకు గురై ప్రజలు చనిపోయిన దాఖలాలు జిల్లాలో కొకోల్లలుగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే శుద్ధజలాల పథకాన్ని గ్రామగ్రామానికి అందిస్తున్నట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు, ఆవాసాలకు ఈ పథకం ద్వారా మంచినీటిని అందించి ప్రజల కష్టాలను తీరుస్తామన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ చెన్నారెడ్డి, ఈఈ వెంకట్‌రెడ్డి, తహశీల్దార్ జ్యోతి, జడ్పీటీసీ చంద్రవౌళి, వెల్కిచర్ల గ్రామసర్పంచు నాగమ్మ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా రంజాక పాలన కాంగ్రెస్‌కే సాధ్యం
- కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి
వెల్దండ, మార్చి 21: ప్రజా రంజక పాలనను అందించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బొల్లంపల్లి గ్రామం నుంచి కోనేటివాడతండా వరకు రూ.4లక్షల నిధులతో చేపట్టే రోడ్డు మరమ్మతు పనులకు ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నూతన జెండాను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఎగురవేశారు. అనంతరం మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూడవత్ మోతిలాల్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యనే ఉంటూ నిస్వార్ధంగా సేవలు అందిస్తుందన్నారు. ముస్లీం, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్నివర్గాల ప్రజల సమన్యాయం చేస్తు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజాభిమానం పొందుతూ వస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. దశాబ్దాల పాటు ప్రజా విశ్వాసం చూరగొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకురుతుందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసిగివేసారిపోయారని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాలు, డీసీసీ అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లమ్మ, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, వర్కింగ్ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పర్వత్‌రెడ్డి, పుల్లయ్య, రమేష్, చందర్, వినోద్, యాదయ్య, నర్సింహ, జంగయ్య, ప్రసాద్‌చ రామకృష్ణ, శంకర్, అనంతరాములు, కృష్ణ, జగన్, శివుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.