క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో లేడీ డాక్టర్‌కు తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, మార్చి22: 44 జాతీయ రహదారి పెబ్బేరు సమీపంలో బాలాజీ దాబా దగ్గర జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ గిరిజ హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఓడి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం హైదరాబాద్ నుండి ఏపి 9బి ఆర్ 9091 కారులో వెళ్తుండగా అదుపు తప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి రోడ్డు అవతల హైదరాబాద్ వెళ్ళే రోడ్డుపై పడింది. ప్రమాద సమయంలో జాతీయ రహదారిపై వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ గిరిజ కుడి చెయ్యి పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా తల భాగానికి పెద్ద గాయమై తీవ్ర రక్త స్రావం జరిగింది. 108 వాహనంలో పెబ్బేరు ప్రాథమిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా డాక్టర్ గిరిజ హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆసుపత్రికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. కర్నూల్‌లోని మైక్యూర్ ఆసుపత్రికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా మైక్యూర్ ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూల్‌లో మైక్యూర్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయతే డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని సురక్షితంగా బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.