మహబూబ్‌నగర్

అసైన్డ్ భూములు ఆక్రమిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, మార్చి 22: మండలంలోని చింతరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన 1200 ఎకరాల భూములు దేవుని మఠంలో ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంటల పెట్టుబడుల కోసం రైతుల భూములుగా అధికారుల చూపించేందుకు రికార్డులను తప్పుగా నమోదు చేయడంతో ఆన్‌లైన్ నమోదుపై అనుమానం వచ్చిన కలెక్టర్ శే్వతామహంతి బుధవారం అమరచింతను సందర్శించారు. రెవెన్యూ అధికారుల తీరుపై హెచ్చరించి తప్పొప్పులను సరిచేయడానికి ఒక్క రోజు సమయం ఇచ్చారు. కలెక్టర్ శే్వతామహంతి ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న భూరికార్డుల ఆన్‌లైన్ నమోదును రెండవ రోజు గంట పాటు తనిఖీ చేశారు. మరో రెండు రోజుల్లో సింగంపేట, నందిమల్ల, మిట్టనందిమల్ల చింతరెడ్డిపల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని తాను కూడా ఆ గ్రామ సభల్లో తను పాల్గొంటానన్నారు. అలాగే ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఎవరైన కొన్నా, ఆక్రమించినా స్వాధీనం చేసుకుంటామని ఆమె తెలిపారు.

ప్రభుత్వ భూముల రికార్డుల పరిశీలన
- జడ్పీ సీఈఓ కొమురయ్య
కోస్గి, మార్చి 22: మండల పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను రికార్డుల ప్రకారం జాబితా తయారు చేయాలని జడ్పీ సీఈఓ కొమురయ్య అన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 26 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల రికార్డులను, భూమిని సర్వే చేసి రికార్డుల జాబితాను కలెక్టర్ కార్యాలయానికి అప్పగించాలని సూచించారు. అదేవిధంగా భూసర్వేలో రైతులకు సంబంధించిన భూములలో ఎలాంటి అవకతవకలు లేకుండా సర్వే నంబర్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు. రైతులకు సంబంధించిన ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియను రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అశోక్, ఏఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రాఘవేందర్, ఆయా గ్రామాల విఆర్‌ఓలు ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులోనే మెరుగైన వైద్యం
* వనపర్తి కలెక్టర్ శే్వతామహంతి
ఆత్మకూర్, మార్చి 22: రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లుగా వనపర్తి కలెక్టర్ శే్వతామహంతి తెలిపారు. గురువారం సాయంత్రం ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియోటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ శే్వతామహంది మాట్లాడుతూ ఆత్మకూర్ సబ్‌డివిజన్ పరిధిలోని రూ.14లక్షల నిధులు వెచ్చించి మహిళలకు ప్రసావాలు చేయించేందుకు ప్రత్యేక ఆపరేషన్ థియోటర్‌ను ఏర్పాటుచేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులో వైద్య సేవలు పెంపొందించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ కిట్లను అందజేస్తోందన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించే విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షింపబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఆసుపత్రి పరిసరా ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉన్న విషయాన్ని కలెక్టర్ గమనించి స్థానిక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో ప్రసావించిన మహిళలకు కేసీఆర్ కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు, తహశీల్దార్ జీకే మోహన్, జడ్పీటీసీ సభ్యులు బాలకిష్టన్న, ఆత్మకూర్ ఎంపీపీ శ్రీ్ధర్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గాయత్రి, అనిల్‌కుమార్‌గౌడ్, వెంకటనర్సింహరావు, ప్రభుత్వ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.