మహబూబ్‌నగర్

సంఘ విద్రోహులను అణచివేతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 22: సంఘ విద్రోహులను అణచివేతకు, జిల్లా పోలీసులు ముందస్తుగా నేరాలను అరికట్టేందుకు, నూతన పరిజ్ఞానం అందరికి అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తుందని ఎస్పీ అనురాధ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభమైన కంప్యూటర్ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ శాంతియుత వాతావరణాన్ని కోరుకునే ప్రజలు ఎల్లప్పుడు పోలీసుశాఖకు అండగా ఉంటూ మన విజయాలను హర్షిస్తారని తెలిపారు. మెజారిటీ ప్రజల సహకారాన్ని అందుకుంటున్న పోలీసుశాఖ అందుకు అనుగుణంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. దేశంలోనే ప్రత్యేకంగా కలిగిన తెలంగాణ రాష్ట్ర పోలీసు మరింత విశిష్టత సాధించేదిశలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మార్పులు చేస్తున్న విషయాన్ని గుర్తించి ఆ దిశగా పనిచేయాలని సూచించారు. శిక్షణలో డ్రాగెంట్ విధానం వల్ల నిఘా విభాగంలో పనిచేసే సిబ్బందికి ఎంతో సహకారం లభిస్తుందని చిన్న గ్రామం నుండి సేకరించే విషయాలను విశే్లషించుకోవడం సులభతరం అవుతుందని అన్నారు. అదేవిధంగా ఇంటిగ్రెటేడ్ పెట్రో మేనేజ్‌మెంట్ పద్ధతికి పోలీసు అధికారులు సిబ్బందికి చెందిన వాహనాలను పూర్తిగా అందుబాటులో ఉంచుకోవచ్చని తెలిపారు.
నేను సైతం కరప్రతం విడుదల
సమాజశాంతిని కాపాడుకునే యత్నంలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలని ఎస్పీ అనురాధ విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం మన కనీస బాధ్యత భావిద్దామని పోలీసుశాఖ చేపట్టిన ఈ కార్యక్రమాలకు అందరి సహకారం కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ భాస్కర్, సీఐ గిరిబాబు, ఇక్తర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూమ్‌లు మంజూరు చేయాలి
* ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి
* ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తి, మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా జర్నలిస్టులందరికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి రాజీవ్‌చౌరస్తాలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళను జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన లక్ష్మయ్య, రమేష్‌గౌడ్, గట్టుయాదవ్ తదితరులు పాల్గొని నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇచ్చేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా విజయ్, వహిద్, తేజ, జిల్లా అధ్యక్షుడు మధుగౌడ్, కొండన్న యాదవ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.