మహబూబ్‌నగర్

మంత్రివర్గంలో మార్పునకు సిఎం శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25: రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు శాఖ మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో మంత్రివర్గంలో మార్పులకు శ్రీకారం చుట్టడంతో అందులో భాగంగా సోమవారం జూపల్లి కృష్ణారావుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. జూపల్లి కృష్ణారావు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిగా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై మంత్రి పదవికి రాజీనామా చేసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో మంత్రిగానే ఉంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో పదయాత్రకు శ్రీకారం చుట్టారు. దింతో అప్పటి మంత్రి డికె అరుణ, జూపల్లి కృష్ణారావుల మధ్య కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విభేదాలు చోటు చేసుకుని ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కెసిఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో కొన్ని నెలల తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా భాద్యతలను అప్పజెప్పారు. అయితే జూపల్లి కృష్ణారావు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడంలో సఫలికృతమయ్యారు. జిల్లాకు కూడా ఆయన కృషి వల్ల భారీ, చిన్న తరహా పరిశ్రమలు వచ్చాయి. దింతో జిల్లాలో యువతకు ఉపాది కూడా లబించే అవకాశం కల్పించడానికి చేస్తున్న తరుణంలో శాఖ మార్పు కొంత నిరాశ పర్చిందని చెప్పవచ్చు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందించడంలో లబ్ది చేకూరే అవకాశం ఉండేదని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావుకు శాఖ మార్పుతో జిల్లాకు మేలు జరుగుతుందని మరో చర్చ కూడా మొదలైంది. అన్ని రంగాల్లో గ్రామాలు వెనుకబడి పోయాయని గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వచ్చే నిధులు జిల్లాకు అత్యధికంగా కేటాయించుకుంటే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రజల భావన. మంచి శాఖనే ముఖ్యమంత్రికి కేటాయించారని పలువురు సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపిపి అభిప్రాయపడుతున్నారు. ఏది ఎమైన జూపల్లి కృష్ణారావుశాఖ మార్పులో అంతార్యం ఏమిటోనంటూ ఆసలు ముఖ్యమంత్రి జూపల్లి కృష్ణారావు శాఖ ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందోనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.