మహబూబ్‌నగర్

అవినీతిపై పోరుకు సహకరించనందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా తాను వివిధ రూపాలలో పోరాడుతుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సహకరించకపోగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ముందుకు రాకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్వత్వానికి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2013 జూన్ 3న హైదరాబాద్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో అప్పటి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరానన్నారు. పార్లమెంట్‌లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ బిల్లును తీసుకొని వస్తే మద్దతు ఇస్తుందని చెప్పడంతోపాటు తెలంగాణ భవిష్యత్ కోసం తాను బీజేపీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు సాకారమై రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత సీఎం కేసీఆర్ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయకుండా ప్రాజెక్టుల రీ డిజైనింగ్, కొత్త ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేర్లతో వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై తాను తగిన సాక్ష్యాలతో హైకోర్టులో కూడా వ్యాజ్యామర వేయడం జరిగిందన్నారు. అయతే టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్న విషయాన్ని అనేక సందర్భాల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని నాగం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అవినీతిపై పోరాటం చేద్దామని, ప్రజలకు వివరించి పార్టీని బలోపెతం చేద్దామని సూచించినా పట్టించుకోలేదని, కనీసం సహకరించలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు రాష్ట్ర నాయకత్వం ఎందుకు ముందుకు రావడంలేదో తెలియడంలేదని అసహనం వ్యక్తం చేశారు. పోరాటానికి విలువ ఇవ్వని పార్టీలో ఎందుకు ఉండాలని నియోజకవర్గంలోని తన అనచరులు, రాష్ట్రంలోని తన అభిమానులు చెప్పారని తెలిపారు. పార్టీకి రాజీనామాపై గత మూడు రోజుల నుంచి నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకొని వారి అభీష్టం మేరకు తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు నాగం ప్రకటించారు. తన భవిష్యత్ కార్యక్రమాన్ని తరువాత ప్రకటిస్తానని, దీనిపై నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానుల అభిప్రాయాన్ని తీసుకొని భవిష్యత్ ప్రణాళికను చెబుతానని అన్నారు. బీజేపీకి చేసిన రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు మెయిల్ ద్వారా పంపిస్తానని తెలిపారు. తనతోపాటు పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు నాగం శశిధర్‌రెడ్డితోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలాగౌడ్, జిల్లాలోని వివిధ జిల్లా మోర్చా అధ్యక్షులు లక్ష్మయ్య, కూచుకుళ్ల నర్సింహారెడ్డి, నసీర్‌తోపాటు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. వీరంతా కూడా తమ రాజీనామా లేఖలను రాష్ట్ర అధ్యక్షులకు పంపించడం జరుగుతుందన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం శశిధర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.