క్రైమ్/లీగల్

బైక్‌ను ఢీకొన్న లారీ వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, మార్చి24: మండలంలోని 44వ జాతీయ రహదారిపై లారీ బైక్‌ను ఢీకోన్న సంఘటనలో శనివారం కుర్వి నాగరాజు (27) అనే వ్యక్తి మృతిచెందాడు. జోగులాంబ జిల్లా అనంతపూరం గ్రామానికి చెందిన నాగరాజు కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలోని కృష్ణవేణి షూగర్ ఫ్యాక్టరిలో సెక్యూర్టి గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడని, డ్యూటికి వెళ్తుండగా పెబ్బేరు సమీపంలో వెనుక నుండి వస్తున్న లారీ ఢీకోట్టడంతో లారీ కింద పడి మృతిచెందినట్లు ఆయన తెలిపారు. మృతుని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత హనీఫ్ కన్నుమూత
మహబూబ్‌నగర్, మార్చి 24: కాంగ్రెస్ సినియర్‌నేత మహ్మద్ హనిఫ్(70) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హనీఫ్ మృతి చెందిన విషయం తెలియడంతో కాంగ్రెస్ శ్రేణులు హుటాహుటిన ఆయన స్వగృహనికి చేరుకుని నివాళ్లు అర్పించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ జగధీశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, ప్రచార కార్యదర్శి బెనహర్‌తో పాటు పలువురు నేతలు నివాళ్లు అర్పించారు. హనీఫ్ దాదాపు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ డీసీసీ ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌గాంధీ పౌండేషన్ ఫోరం జాతీయ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వినర్‌తో పాటు జిల్లా కన్వినర్‌గా కూడా పదవులు నిర్వహించారు. మంచి సత్సంబంధాలు ఉన్న నేతను కొల్పోవడం కాంగ్రెస్ట్‌కి తీవ్ర నష్టమని డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

బందువులతో కలిసి
భర్తను హతమార్చిన భార్య
లింగాల, మార్చి 24: జీవితాంతం తోడువుండాల్సిన భార్య తన బందువులతో కలిసి భర్తను హతమార్చిన సంఘటన మల్లోనిచెర్వు తాండలో జరిగింది. సంఘటన స్థలానికి సీఐ రామకృష్ణతో కలిసి డిఎస్పీ రవికుమార్ పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ మలల్లోని చెర్వు తాండకు చెందిన కొడెల పరుశరాములు(42) శుక్రవారం రాత్రి తన ఇంటి బయట పందిరి కింద మంచంపై నిద్రిస్తున్న సమయంలో భార్య తిరుపతమ్మ, ఆమె చెల్లెలు రేణుక, మరిది నాగులుతో కలిసి కర్రతో తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని ఇంటి అవరణంలో ఉన్న నీళ్ల హౌజ్ వద్ద వదిలివేశారు. తాగుడుకు బానిసైన మృతుడు భార్యతో తరుచుగా గొడవ పడుతుండెవాడని వీరి మద్య ఆస్థి తగదాలు ఉన్నాయన్నారు. మృతుడికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత 15 రోజుల క్రితం కూతురికి వివాహం చేయించిన పెళ్లి పందిరి కింద మృతి చెందడం అందరిని కలిచివెసింది. దోషులను కఠినంగా శిక్షించాలని పరుశరాములు, బంధువులు డిమాండ్ చేశారు. మృతుడి తమ్ముడు వెంకటపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణు తెలిపారు.