మహబూబ్‌నగర్

ప్రభుత్వం మెడలు వంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, మార్చి 24: టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడచిపోయినా ప్రభుత్వం ఎలాంటి హామీని నెరవేర్చలేదని ప్రభుత్వ మెడలు వంచేందుకు బిజెపి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు శాంతికుమార్, నాగూరావు నామజీ, రతంగ్‌పాండురెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై శనివారం నారాయణపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయని ప్రభుత్వం మరోమారు ప్రజలను మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని ప్రయత్నిస్తోందన్నారు. తెలంణగాణ రాష్ట్రం ఏర్పాటైతే దళితుడిని సిఎం చేస్తానని చెప్పిన కెసిఆర్ మొదటి హామీనే తుంగలో తొక్కి తానే సిఎం పదవిలో కూర్చున్నారన్నారు. పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నాలుగు సంవత్సరాల్లో ఒక్కటి నెరవేర్చలేదన్నారు. గల్లీలోనే గతిలేదు ఢిల్లీకి వెళతానంటూ సిఎం కెసిఆర్ అభధ్రతాభావంతో చేస్తున్న వాఖ్యలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ పేరిట తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకుని సిఎం పదవితో పాటు రెండు మంత్రి పదవులు, ఒక ఎంపి పదవి ఇచ్చి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్న విషయాన్ని సిఎం గుర్తుంచుకోవాలన్నారు. సమస్యల సాధన కోసం ఇక సమరమే అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఈశ్వర వీరప్పయ్య అలయాన్ని సందర్శించిన ఎంపీ జితేందర్
దేవరకద్ర, మార్చి 24: శ్రీశ్రీశ్రీ ఈశ్వర వీరప్పయ్య బ్రహోత్సవాల్లో బాగంగా శనివారం మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యులు జితెందర్‌రెడ్డి సందర్శించారు. ఏంపిని బ్రహ్మణులు పూర్ణకుంభంతో మేళ తాళలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సన్మానించారు. స్వామికి ప్రత్యేకపూజలు చేశారు. అలయకమిటి చైర్మన్ బాస్కర్‌రెడ్డి అదివారం 12.30 గంటలకు శ్రీరాముని కల్యాణం శ్రీ ఆంజనేయస్వామి అలయంలో నిర్వహిస్తున్నామని కల్యాణంకు హజర్ కావాలని ఎంపిని కోరారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దేవాలయల అబివృద్దికి సీఎం పెద్ద ఎత్తున నిదులు మంజూరు చేసి అబివృద్దికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం దేవరకద్ర వ్యవసాయమార్కెట్ కమిటి చైర్మన్ నరసింహ్మరెడ్డి ఇంటికి వెళ్ళి మాతృమూర్తి పరమపదించినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు.