మహబూబ్‌నగర్

నకిలీ విత్తనాలను అరికడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మార్చి 24: నకిలి విత్తనాలు, నకిలి ఎరువులను ప్రోత్సహిస్తే ఎలాంటి వారిపైన చర్యలు తీసుకొంటామని, ఎవరిని ఊపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ హెచ్చరించారు. శనివారం స్థానిక బాలభవన్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు, మరియు క్రిమి సంహాకార మందుల విక్రయాలపై జిల్లాలోని డీలర్లకు, సీడ్ ఆర్గనైజర్లకు అవగాహాన కల్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కొరకు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, దళారుల నుంచి రైతులు మోసపోకుండా కట్టుదిట్టమైనా చర్యలు తీసుకొనిందని తెలిపారు. వ్యవసాయ అధికారులు, పోలీసు వారు సంయుక్తంగా జిల్లాలో నకిలి విత్తనాలు, ఎరువులు అరికట్టడానికి ఏఎస్పీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటిలు ఏర్పాటు చేశామని, గద్వాల, అలంపూర్ సర్కిల్‌లో విశృత్తంగా తనిఖీలు నిర్వహించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆర్గనైజర్లు, దుఖాణుదారులను ఎవరిని ఊపేక్షించేది లేదని, టాస్క్ ఫోర్స్ టీం జిల్లాలో ఎప్పుడైనా తనిఖీలు నిర్వహిస్తుందని, అందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆరుగాలం పండించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించక, నకిలి విత్తనాలతో సతమవుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులకు నకిలి విత్తనాలు, నకిలి ఎరువుల నుంచి బెడద రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. అంతకు ముందు వ్యవసాయా అధికారులు మాట్లాడుతూ నకిలి విత్తనాలతోపాటు, దళారులను ఎరువులు, విత్తనాలు అమ్మే దుఖాణుదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగియుండి, గుర్తింపు పొందిన విత్తనాలే అమ్మేటట్టు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. దుఖాణుదారులు తప్పని సరిగా రికార్డులు మేయింటెనెన్స్ చేయాలని, జిల్లా వ్యవసాయ అధికారులు, పోలీస్ అధికారులు ఏ సమయంలో వచ్చిన రికార్డులు చూపెట్టాలన్నారు. ప్రభుత్వం నిషేదించిన బిటి -3 విత్తనాలు పండించిన, అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. ప్రతి ఒక్క దుఖాణుదారుడు తప్పకుండా ఈపాస్ యంత్రాల ద్వారా క్రయ విక్రయాలు జరుపాలని, లేని పక్షంలో మీ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రాసెసింగ్ యూనిట్ దారులు ప్రతి గింజకు లెక్క చెప్పాలని, లెక్క తేలకుంటే అంతే సంగతులు అన్ని పరోక్షంగా హెచ్చరించారు. ఈకార్యక్రమంలో డియస్పీ సురేందర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, వ్యవసాయ అధికారి ఆశోక్‌వర్దన్ రెడ్డి, గద్వాల, అలంపూర్ సీఐలు, ఎస్సైలు, వ్యవసాయ అధికారులు, డీలర్లు, సీడ్ ఆర్గనైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

క్షయవ్యాధిని నివారిద్దాం
కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ పిలుపు
గద్వాల, మార్చి 24: క్షయవ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, ప్రతి ఒక్కరూ నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవాని పురష్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పాతబస్టాండు నుంచి డియంహెచ్‌ఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ హాజరై మాట్లాడారు. సరైన చికిత్స తీసుకుంటే టీబి వ్యాధి నయం అవుతుందని, వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. టిబి నియంత్రణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ఈ వ్యాధిని సమాజం నుండి పూర్తిగా పారద్రోలేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటు నివారణ మందులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నూటికి నూరుశాతం నయమవుతుందని, లేని పక్షంలో ఒకరి ద్వారా మరొకరికి సోకే ప్రమాదం ఉందన్నారు. టీబి రోగులకు వైద్య సేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపూ కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేసి జిల్లాను క్షయావ్యాధిరహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో డియంహెచ్‌ఓ డాక్టర్ సునీత, డిప్యూటి డిఎంహెచ్‌ఓ, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.