మహబూబ్‌నగర్

ప్రజలను మోసం చేయడంలో దొందూ దొందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, మార్చి 24: ప్రజలను మోసం చేయడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఅర్‌ఎస్‌లు దొందు దొందెగా వ్యవహరిస్తున్నాయని, ఇంటికి సగనంపాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఎగురవేశారు. ఈసందర్బంగా మండల పార్టీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత వంట చేసుకోనే గ్యాస్ ధర విపరీతంగా పెంచిందని. ముఖ్యంగా నోట్ల రద్దు పేరుతో ప్రజలను నేటికి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అభివృద్ది జపంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ అవినీతిలో కురక పోయిందని అన్నారు. పేదలపై సామాన్య ప్రజలపై మోయలేని బారాలు మోపుతు సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తునానరని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి దుయ్యబట్టారు. అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని పాలించడంలోటిఅర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వం ఘెరంగా వైఫల్యం చెందిందన్నారు. పోటిపడి అప్పులు చేస్తు ప్రజలను అప్పుల ఉబిలోకి నెట్టెందుకు బీజేపీ, టిఅర్‌ఎస్ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆయన ఎద్దేవ చేశారు. అధికార అహకరంతో మోధి, కెసిఅర్ ప్రతి పక్షాలను అణగ దొక్కోందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తు పాలన సాగిస్తున్నారని వీరికి పోయే కాలం వచ్చిందన్నారు. తెలంగాణ వాదంతో గద్దెనెక్కిన కెసిఅర్ నాలుగేళ్లుగా ప్రజలకు ఓరగ బెట్టింది ఎమి లేదని ఎద్దేవ చేశారు. దనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా చేసి గొప్పలు చెప్పుకోవడం ముఖ్యమంత్రి కెసిఅర్‌కే చెల్లుతుందని అయన విమర్శించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌రెడ్డి, తాలుక అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, సోమయ్య, శేఖర్, పుల్లయ్య, ఈదమయ్యగౌడ్, వినోద్, హన్మంతురెడ్డి, మణిపాల్‌నాయక్, నారాయణ, నర్సింహ్మ, శ్రీకాంత్‌గౌడ్, చిన్నగౌడ్, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సొంత గూటికి రండి
నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అరుణ పిలుపు
అచ్చంపేట, మార్చి 24: అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఒత్తిళ్లకు తలొగ్గి గతంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తిరిగి కాంగ్రెస్ సొంత గూటికి రావాలని మాజీ మంత్రి , గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ పిలుపునిచ్చారు. శనివారం అచ్చంపేట పట్టణంలో బల్మూరు జడ్పీటీసీ ఆంగోతు ధర్మానాయక్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న బల్మూరు జడ్పీటీసీ ధర్మానాయక్‌ను కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఆహ్వనించారు. ఆయన నూతన గృహములో మాజీ మంత్రి ,గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ విలేఖర్లతో మాట్లాడుతూ అధికార పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని ప్రజలకు ఎన్నికల ముందు అనంతరం ఇచ్చిన హామిలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమై చికటి రోజులు దాపురించాయని ఆమె విమర్షించారు. మాటలకే పరిమితమై హామిలను కాగితాల వరకు చూపుతున్నారని అన్నారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో దాదాపు పది రోజులు ఇక్కడే వుండి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన ప్రజలు టీఆర్‌ఎస్ ఇచ్చిన రూ. 4వేల, డబల్‌బెడ్ రూం హామిలకు గెలిపించారని నాలుగేళ్లు గడిచినా హామిలు అమలుకాక ఆశలు అవిరై ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ కట్టివాలని ఆమె డిమాండ్ చేశారు. డబల్ బెడ్‌రూం ఇల్లు వస్తుందనే ఆశలో అచ్చంపేట నగర పంచాయతీలో ఓటు వేస్తే రెండేళ్లు గడిచినా శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామి డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం చేయిస్తానని సీఎం కెసీఆర్ క్యాంపు ఆఫీసు ఉన్న వందల కోట్ల ప్రజ ధనంతో ప్రగతిభవన్, ఎమ్మెల్యేలకు నియోజకరవర్గంలో ఆధునాతనమైన క్యాంపు ఆఫీస్‌లను ముందుగా కట్టుకొని సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేశారని ఎద్దెవా చేశారు. ప్రజాస్వామ్య విలువలను అధికార పార్టీ కాలరాసిందని ఉద్యామ కారులను, రైతులను, నిరుద్యోగులను పట్టించుకోలేదని అమరుల కుటుంబాలకు అందరికి న్యాయం జరుగలేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోని వస్తే రైతులకు రూ.2లక్షల రుణా మాఫీ ఏకకాలంలో చేస్తామని, నిరుద్యోగులకు మూడు వేలు నిరుద్యోగ బృతి, మహిళ సంఘాలకు వడ్డిలేని రూ.1లక్ష రివాల్విండ్ ఫండ్ అందించడం జరుగుతుందని ఇటివల డిల్లీలో జరిగిన ప్లినరీలో తీర్మానించడం జరిగిందని డికె అరుణ అన్నారు. అన్నిరంగాల్లో విఫలమైన టీఆర్‌ఎస్ పార్టీని ఇంటికి పంపించి కాంగ్రెస్‌కు చేయుతను అందించాలని మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

బాధితులకు న్యాయం జరగాలి
చట్టాల అమలులో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ అనూరాధ
మహబూబ్‌నగర్, మార్చి 24: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరిస్తున్న నూతనంగా ఏర్పడుతున్న చట్టాలను ఆమలు పర్చడంలో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవగాహన పెంచుకుంటూ సమన్వయంతో పనిచేయడం వల్ల బాధితులకు న్యాయం చేసినవారు అవుతామని తద్వారా వ్యవస్థపై ప్రజలకు గౌరవం, నమ్మకం పెరుగుతుందని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమన్వయ సమావేశంలో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు, న్యాయవ్యవస్థలపై ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలంటే బాధితులకు న్యాయం జరిగినప్పుడే అదిసాధ్యమవుతుందన్నారు. పోలీసు అధికారులు కేసుల పరిశోధనలో ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు నిర్వహిస్తే బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. దాంతో కోర్టులో ప్రాసిక్యూటర్లకు కూడా కేసు విషయం క్షుణ్ణంగా తెలిసి నేరాలకు పాల్పడ్డవారికి శిక్ష విధించడంలో ప్రాసిక్యూటర్లు కూడా న్యాయమూర్తితో వాధించే అవకాశాలు ఉంటాయని కేసు పూర్వపరాలు సవ్యంగా జరుగుతాయన్నారు. ప్రజల్లో కూడా ప్రస్తుతం వస్తున్న చట్టాలపై, ఇది వరకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అందుకే జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ చైతన్యవంతమైన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులకు నమ్మకం కలిగించేలా వారి దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా వారికి న్యాయం జరిగేలా కిందిస్థాయిలోనే కేసుకు సంబంధించి సాక్షాధారాలను పకడ్బంధిగా సేకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో నింధితులు తప్పించుకునే వీలు ఉండదని బాధితులకు కోర్టులో తప్పక న్యాయం జరుగుతుందన్నారు. చీడ్‌ఫండ్ వ్యవహారాల్లో జరిగే మోసాల్లో ప్రజలకు అందజేయాల్సిన న్యాయపరమైన సహయం అందించాల్సిన భాద్యత ఇటు పోలీసులకు అటు న్యాయవాధులకు ఉందని తెలిపారు. చీడ్‌ఫండ్ వ్యవహారాల్లో మోసానికి గురైన బాధితులకు పోలీసుశాఖ అండగా ఉంటుందని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఇలాంటి కేసుల విషయంలో క్షుణ్ణంగా వ్యవహరిస్తే మోసానికి పాల్పడ్డ చీడ్‌ఫండ్ నిర్వాహకులు చట్టం నుండి తప్పించుకోలేరన్నారు. పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయడం వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీలు భాస్కర్, శ్రీ్ధర్, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలగంగాధర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.