మహబూబ్‌నగర్

జంక్షన్లను అభివృద్ధి చేస్తేనే పట్టణాలకు కొత్తశోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 24: జంక్షన్ల అభివృద్దితోనే పట్టణాలకు కొత్తశోభ, సుందరీకరణ వస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు కూడళ్లను మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ , మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని డిఇఓ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, రాజీవ్‌గాంధీ, రైల్వేస్టేషన్ చౌరస్తా, న్యూటౌన్ తదితర చౌరస్తాలలోని కూడళ్లను వారు పరిశీలించారు. అదేవిధంగా వివిధ వార్డులలో జరుగుతున్న డబుల్ బీటిరోడ్డు పనులను పరిశీలించారు. న్యూటౌన్ నుండి ఎల్ ఐసి కార్యాలయం వరకు, నేతాజీచౌక్ నుండి రైల్వేస్టేషన్ వరకు జరుగుతున్న డబుల్‌రోడ్ పనులను పరిశీలించడంతోపాటు స్ట్రిట్‌లైట్ల ఏర్పాట్లను కూడా వారు పరిశీలించారు. టౌన్‌ప్లానింగ్ అధికారులకు జంక్షన్ల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. జంక్షన్లలో రోడ్లను వెడల్పు చేయాలని ఆదేశించారు. రోడ్లపై అనుకుని ఉన్న కంపౌండ్‌వాల్స్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత యజమానులకు నోటీసులు కూడా జారీ చేయాలని సూచించారు. ముందుకు వారికి అవగాహన కల్పించి వారంతంటవారే స్వచ్చంధంగా తొలగించుకునేలా కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు సూచించారు. పట్టణం సుందరంగా ఉండాలంటే జంక్షన్ల అభివృద్ది ఎంతో ముఖ్యమని దినిని దృష్టిలో పెట్టుకుని అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం నిధులు దండిగా కేటాయిస్తుందని నిధుల కొరతనే లేదని తెలిపారు. మున్సిపల్‌లో కూడా నిధులు పుష్కలంగా ఉన్నాయని అన్ని నిధులు కలిపి మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు కూడళ్లను, చౌరస్తాలను, జంక్షన్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఒక్కొక్క కూడళ్లలో అక్కడి పరిస్థితులను బట్టి నిధుల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఇప్పటికే రాజేంద్రనగర్, డిఇఓ కార్యాలయం రోడ్ డబుల్‌రోడ్‌గా మారిందని తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని రహదారులను పట్టణంలో డబుల్‌రోడ్లుగా మారుస్తామని అవసరం ఉన్న చోట బ్రిడ్జిల నిర్మాణం చేస్తామని తెలిపారు. జంక్షన్ల అభివృద్ధి కోసం దాదాపు ప్రస్తుతానికి రూ.10కోట్ల మేర నిధులు కేటాయించడం జరిగిందని మరో రూ.10కోట్లు త్వరలో కేటాయిస్తామని తెలిపారు. పలు చౌరస్తాల్లో మహానీయుల విగ్రహాలు ఉన్నందున వాటికి ఇబ్బంది కలుగకుండా పనులు చేస్తామన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.