క్రైమ్/లీగల్

దోపిడీ దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, మార్చి 26: అర్ధరాత్రి దోపిడీ దొంగలు మానవపాడు, ఉండవెల్లి మండలాలలో బీభత్సం సృష్టించారు. కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఉండవెల్లి మండల పరిధి అలంపూర్ చౌరస్తాలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న భవన నిర్మాణ కార్మికులను బెదిరించి రూ.42 వేలు దోచుకున్నారు. మానవపాడు మండల పరిధి జాతీయ రహదారిపై ఉన్న శ్రీసాయి చక్ర కోల్డ్ స్టోరేజిలో నివాసముంటున్న వారిపై ఇనుప రాడ్లతో దాడి చేసి నాలుగు తులాల బంగారు దోచుకున్న సంఘటన ఆదివారం అర్దరాత్రి చోటుచేసుకుంది. బాదితుల, పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన భవన కార్మికులు గత రెండు సంవత్సరాలుగా చౌరస్తాలో నిర్మిస్తున్న కళాశాల భవన నిర్మాణం పనుల్లో ఉన్నారు. ఒంగోలు నుంచి దాదాపు 40 మంది కార్మికులు చౌరస్తాలోని విశ్రాంత బ్యాంకు ఉద్యోగి దీనదయాల్ ఇంటిని రూ. 4500లకు అద్దెకు తీసుకున్నారు. అందులో తలదాచుకుంటూ భవన నిర్మాణ పనులు చేపడ్తున్నారు. కళాశాల భవనం పూర్తి కావటంతో కొందరు తమ గ్రామాలకు వెళ్లారు. చౌరస్తాలోని ఓ దుకాణ సముదాయ నిర్మాణానికి ఒప్పందం చేసుకొని అది పూర్తి చేశారు. కార్మికులలో కొందరు తమ బంధువుల పెళ్లిలకు హాజరయ్యేందుకు వెళ్లగా మేస్ర్తీ వీరయ్య, కోటేశ్వరరావు, జాన్, అంజయ్య, అబ్రహాం, వెంకటేశ్, కిరణ్, మేరమ్మ, ప్రగతి(5)లు చౌరస్తాలోనే ఉండి పోయారు. ఆదివారం అర్దరాత్రి కొందరు దుండగలు రాళ్లు రువ్వుతూ ఆరుబయట నిద్రిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ నిద్ర లేపారు. మేము 15 మంది ఉన్నాము, గేటు తలుపులు తీయాలని కత్తులతో బెదిరించారు.
దీంతో వీరయ్య గేటును తీశాడు, లోనికి ప్రవేశించిన దుండగులు కత్తులతో బెదిరిస్తూ వారి వద్ద ఉన్న నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందరినీ ఓ గదిలోకి తీసుకెళ్లి ఓ చీరను చింపి చేతులు కట్టివేశారు. బ్యాంకు ఉద్యోగి ఎక్కడ ఉన్నాడని ఆరా తీశారు. లేదు మేము అద్దెకుతీసుకున్నామని భవన కార్మికులు సమాధానం ఇచ్చారు. మద్యం దుకాణాలలో ఎంతమంది ఉంటారని విచారించారు. కార్మికుల ద్విచక్ర వాహనాన్ని తీసుకొని మద్యం దుకాణాల వైపు వెళ్లి వచ్చినట్లు సమాచారం. నగదు ఎక్కడ ఉందని సోదాలు నిర్వహించి పెట్టెలో ఉన్న పర్సును తీసుకొని అందులోని రూ 42 వేలు స్వాధీనం చేసుకున్నారు.
పండుగకు కొత్తగా తెచ్చుకున్న ఓ యువకుడి రెండు జతల బట్టలు, చిన్నారి ప్రగతి కాలి మెట్టలు దోచుకొని వెళ్లారు. బాధితులు నిర్మాణాలు చేపట్టిన ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చారు.

మానవపాడులో
మండల పరిధి జాతీయ రహదారిపై ఉన్న శ్రీ సాయి చక్ర కోల్డ్ స్టోరేజిలో నివాస ముంటున్న కుటుంబంపై దుండగులుదాడి చేసి నాలుగు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. స్టోరేజిలో శంకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రవి కుమార్‌రెడ్డి, కవితమ్మ, అనంతమ్మలు నివాసముంటుండగా లోకేశ్ నాయుడు వాచ్‌మెన్‌గా విధులునిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి లోకేశ్‌నాయుడు, శంకర్‌రెడ్డిలు స్టోరేజి ఆవరణలో ఆరుబయట నిద్రించారు. రాత్రి మూడు గంటల సమయంలో దుండగులు శంకర్‌రెడ్డి, లోకేశ్‌లను కత్తులతో బెదిరిస్తూ నిద్ర లేపారు. శంకర్‌రెడ్డిపై ఇనుప రాడ్లతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. వారిని బెదిరిస్తూ మిద్దెపై ఉన్న శంకర్‌రెడ్డి కుటుంబాన్ని నిద్ర లేపారు. అందరినీ ఓ గదిలో బంధించి అనంతమ్మ, కవితమ్మల మెడలోని దాదాపు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, చెవి కమ్మలు దోచుకున్నారు. అక్కడ నుంచి జారుకున్నారు. కోలుకున్న బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలాలను పరిశీలించిన ఎస్పీ
దొంగల దోపిడి ముఠా చేసిన హల్‌చల్‌కు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ రజితలు పరిశీలించారు. బాదితులను విచారించారు. భీభత్పం సృష్టించిన వైనాన్ని అడిగి తెలుసుకున్నారు.