మహబూబ్‌నగర్

అడుగంటిన రామన్‌పాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: జిల్లాలో రోజు రోజుకు నీటి కష్టాలు జటిలమైపోయాయి. అందులో భాగంగా ముఖ్యంగా జిల్లాకు ప్రదాన జీవనాధారంగా చెప్పుకునే రామన్‌పాడు ప్రాజెక్టు అడుగంటిపోయి ఎండిపోయింది. దింతో రామన్‌పాడు ప్రాజెక్టుకు సంబందించిన తాగునీటి పథకాల పరిస్థితిదినదిన గండంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాలకు అందించే తాగునీటి పథకాల పంప్ హౌజ్‌లకు నీరు అందకపోవడంతో అధికారులు ప్రత్యామ్నయ చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు అడుగుభాగంలో కాలువలు తవ్వే పనిలో పడ్డారు. జూరాల ప్రాజెక్టులో ఉన్నటువంటి కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు ప్రాజెక్టుకు వదులుతున్నారు. అయితే ఈ నీరంతా ప్రాజెక్టులో నిలువ ఉంచితే తాగునీటి ప్రాజెక్టుల పంప్ హౌజ్‌లకు నీరు అందదని భావించిన అధికారులు కాలువలు తవ్వి పంప్ హౌజ్‌కు నీటిని అందిస్తున్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్ దగ్గరుండి తమ పట్టణానికి అంధించే కాలువ పనులను తవ్వించారు. కాలువ తవ్వకంలో పెద్ద బండరాయి రావడంతో బండరాయిన బద్దలు కొట్టే వరకు అక్కడే ఉండి సంపుకు నీరు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. గత వారం రోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరా ప్రస్తుతం రామన్‌పాడు ప్రాజెక్టులో కాలువలు తీసి పంప్ హౌజ్‌కు నీటిని అందించడంతో తిరిగి జిల్లా కేంద్రానికి నీటి సరఫరా ప్రారంభమైంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రామన్ పాడు ప్రాజెక్టు ఎండిపోయి దర్శనమిస్తుంది. ప్రాజెక్టు చరిత్రలో ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఎన్నడు చూడలేదు. జూరాల ప్రాజెక్టులో కూడా కాలువలు తవ్వి రెగ్యులేటర్ల వరకు నీటిని పంపిస్తు రామన్‌పాడుకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అటు జూరాల, ఇటు రామన్‌పాడు ప్రాజెక్టులు అడుగంటిపోవడంతో జిల్లాలో నీటి కష్టాలు మరింత జటిలమయ్యాయి. రామన్‌పాడు పరిస్థితి దుర్భిక్షంగా మారింది.