క్రైమ్/లీగల్

గుండాలలో వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, మార్చి 31: వెల్దండ మండలం గుంగాల గ్రామానికి చెందిన ఎనుముల రమేష్(30) అనే వ్యక్తి పది రోజుల క్రితం పెట్రోల్ పోసుకోని అత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపారు. భైరాపూర్ గ్రామానికి చెందిన శిరిషాతో నాలుగు సంవత్సరాల క్రితం గుండాల గ్రామానికి చెందిన రమేష్‌తో వివాహం జరిగిందని, శిరిషా ఇటీవల బావిలో పడి కాలు విరిగి పోవడంతో పాటు సంతానం కూడ లేక పోవడంతో మానసిక ప్రవర్తన అంతగా లేని రమేష్ జీవితంపై విరక్తి చెంది మార్చి 20న గుండాలలో పెట్రోల్ తీసుకోని పోయి అప్పరాజు గుట్టల్లో పోసుకోని అత్మహత్యకు పాల్పడినట్లు, అటు వైపు గొర్రెలు కాసేందుకు వెళ్లిన కాపరి గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు తమ వాడు రమేష్‌గా గుర్తించినట్లు అయన తెలిపారు. ఈమేరకు రమేష్ తండ్రి పర్వతాలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యాలరాంమూర్తి తెలిపారు.