క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, ఏప్రిల్ 3: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి పాన్‌గల్ మండల పరిధిలోని నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్‌ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మద్దిలేటి (35) అనే వ్యవసాయ రైతు పురుగుల మందు తాగి మృతిచెందాడని తనకున్న వ్యవసాయ పొలంలో పంటను సాగుచేయగా, దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేక మనస్థాపం చెంది వ్యసాయ పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పంచనామ నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి
- ప్రభుత్వ అసుపత్రికి తరలింపు
కల్వకుర్తి, ఏప్రిల్ 3: పట్టణ సమీపంలో గల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అంజయ్యగౌడ్ (32), రామస్వామి (33)లు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేందర్‌రెడ్డి తెలిపిన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన అంజయ్యగౌడ్, కల్వకుర్తి పట్టణానికి చెందిన రామస్వామిలు కేఎల్‌ఐ ప్రధాన కాల్వలో ఈత కొట్టేందుకు వెళ్ళి కాల్వలో గల్లంతయ్యారు. కేఎల్‌ఐ కాల్వలో గాలించగా వారి దుస్తుల్లో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా వారిని గుర్తించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కాల్వలో ఈతకు వెళ్లిన వారు నీటిని మింగడంతో ప్రమాదవశాత్తు మృతి చెందారని తెలిపారు. అనంతరం మృతదేహాలను కల్వకుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ పేర్కొన్నారు.