క్రైమ్/లీగల్

వీడిన బాలుడి కిడ్నాప్ మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఏప్రిల్ 10: అక్రమ సంబంధం నేపథ్యంలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కేసును పోలీసులు 17 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు వంశీకృష్ణ నాయక్ బాలుడ్ని తీసుకుని పూణె పారిపోగా పోలీసులు చాకచక్యంగా బాలుడ్ని రక్షించి తీసుకొచ్చారు. కేసును పోలీసులు చేధించిన వివరాలను మంగళవారం కొత్తకోట సీఐ కార్యాలయంలో ఇన్‌చార్జీ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వివరించారు. నాటవెల్లి ఉరగట్టు తండాకు చెందిన రాజునాయక్ సోదరి నారమ్మ. ఆమెకు మహబూబ్‌నగర్ మండలం వెంకటాపురం రేగడిగడ్డతండా అడవి వెంకటాపురం గ్రామవాసి వంశీకృష్ణనాయక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అయతే, గత కొంతకాలంగా సజావుగా సాగిన వీరిద్దరి మధ్య ఇటీవల గొడవలు ఏర్పడ్డాయ. దీంతో నారమ్మను ఎలాగైనా తనదారిలోకి తెచ్చుకోవాలని వంశీకృష్ణనాయక్ ఆమె మేనల్లుడి కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. నారమ్మ మేనల్లుడైన చందునాయక్ కొత్తకోట పట్టణంలోని భారతీయ విద్యా మందిర్‌లో మూడవ తరగతిని చదువుతున్నాడు. వంశీకృష్ణ నాయక్ ఈనెల 7న పాఠశాలకు వెళ్లి మీ అమ్మకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి చందును బయటకు తీసుకెళ్లాడు. ఆపై బాలుడిని టీఎస్ 10యుబి 0478 అనే నెంబర్ గల ఆటోలో హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. తనతో మునపటిలా సంబంధాన్ని కొనసాగించకపోతే చందునాయక్‌ను చంపుతానని నారమ్మను బెదిరించాడు. ఈ విషయాన్ని నారమ్మ తన అన్న రాజునాయక్‌కు ఫోన్‌లో సమాచారం అందించింది. రాజునాయక్ కొత్తకోట ఎస్‌ఐ, సీఐకి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన కొత్తకోట సీఐ సోమ్‌నారాయణసింగ్, ఎస్‌ఐలు రవికాంత్‌రావులు రంగంలోకి దిగి కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఆటో నాంపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉండటాన్ని గుర్తించారు. వంశీకృష్ణనాయక్ రైలు ఎక్కి పూణె వెళ్లినట్లు అతడి ఫోన్ సిగ్నల్ ద్వారా సమాచారాన్ని పోలీసులు కనుగొన్నారు. అక్కడి రైల్వే పోలీసులతో పాటు ప్రత్యేక దళాలతో బాలుడిని కాపాడారు. కేసును ఛేదించిన పోలీసులను ఆమె అభినందించారు. 17 గంటలోనే కేసును ఛేదించడం పట్ల పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్‌రావు, జములప్ప, డీఎస్పీ సృజన తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.