మహబూబ్‌నగర్

బకాయిలు పేరుకుపోవడంతో పంచాయతీ కార్యాలయానికి కరెంటు కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 26: నగరపంచాయతీకి సంబంధించిన కరెంటు బకాయిలు రోజురోజుకు పేరుకపోవడంతో మంగళవారం ట్రాన్స్‌కో అధికారులు స్థానిక నగరపంచాయతీ కార్యాలయంకు కరెంటుకట్ చేశారు. దీనితో కార్యాలయంలో కరెంటు లేకపోవడంతో ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వివిధ రకాల దృవీకరణ పత్రాలకోసం, బిల్లులు చెల్లించేందుకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది ఇలా ఉండగా నగరపంచాయతీకి సంబందించిన నీటిబోర్లకు ఉన్న కరెంటు కనెక్షన్లు, వీధిలైట్లు తదితర వాటికి సంబందించి ఇప్పటి వరకు రూ.3.70 కోట్లు బకాయిగా ఉందని, వీటిని వెంటనే చెల్లించాలని గత కొన్ని రోజుల నుంచి సంబంధిత అధికారులను కోరుతున్నా స్పందన లేకపోవడంతో మంగళవారం కార్యాలయంకు కరెంటు కట్ చేస్తున్నామని, ఇప్పటికి స్పందించకపోతే నీటిబోర్లకు, వీధిలైట్లకు సైతం కరెంటు కనెక్షన్లు కట్ చేయాల్సి వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. నగరపంచాయతీ అధికారుల వాదన మరోలాగా ఉంది. గతంలో ఉన్న బకాయిలను ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్స్ నిధుల నుంచి రూ.5.62 కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లించడం జరిగిందని, ఇంకా మిగతా బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగిందని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలమేరకు తగినచర్యలు తీసుకుంటామని అన్నారు.
నగరపంచాయతీకి సంబందించి ఎన్ని మీటర్లు ఉన్నాయి, నెలనెల ఎంతమేర కరెంటు వినియోగమవుతుంది, ఎంత చెల్లించాలనే దానిపై బిల్లులు మాత్రం ట్రాన్స్‌కో అధికారుల నుంచి రావడంలేదని, కాని అప్పుడప్పుడు సిబ్బంది వచ్చి ఇంత బిల్లు ఉంది, వెంటనే చెల్లించాలని చెబుతున్నారేకాని, బిల్లులు మాత్రం ఇవ్వడంలేదని నగరపంచాయతీ అధికారులు అంటున్నారు. మొత్తంమీద మంగళవారం నగరపంచాయతీకి కరెంటు కట్ చేయడంతో ట్రాన్స్‌కో, నగరపంచాయతీ అధికారుల మధ్య వివాదమయ్యే పరిస్థితులున్నాయి. ఈ విషయంపై స్పందించేందుకు అటు కమీషనర్‌గాని, ఇటు చైర్మన్‌గాని అందుబాటులో లేరు.