మహబూబ్‌నగర్

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, ఏప్రిల్ 16: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మోతిలాల్‌నాయక్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లాప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామ, గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారిస్తున్నట్లు చెప్పా రు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం అత్యధిక ప్రాధన్యతనిచ్చి నిధులు వెచ్చించామన్నారు. కల్వకుర్తి నియో జకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు ప్రతి ఒక్కరు పార్టీలకీతతంగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్నాది ఒక్కటి చేస్తున్నాది మరొకటిలా ఉందని విమర్శించారు. టీఅర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనకు తప్ప మరొకటి చేయడం లేదని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకోని పరిపాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. సమావేశంలో మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్, డిసిసి అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ కడారి కృష్ణయ్య, కిసన్‌సెల్ తాలుకా అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, నాయకులు శేఖర్, ఈదమయ్యగౌడ్, వెంకట్‌నాయక్, ఏర్రశ్రీను, కృష్ణారెడ్డి, పుల్లయ్య, నారాయణ, ప్రసాద్, చందునాయక్, తదితరులు ఉన్నారు.

గొండ్యాల్ లిప్ట్ ద్వారా 1500 ఎకరాలకు సాగునీరు
- నీటి పారుదల శాఖ సీఈ సురేష్‌కుమార్
కోయిలకొండ, ఏప్రిల్ 16: హన్వాడ మండలంలోని గొండ్యాల్ వాగు నుండి గ్రావిటీ ద్వారా ఐదు చెరువులకు 1500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ సీఈ సురేష్‌కుమార్ వెల్లడిం చారు. సోమవారం మండలంలోని చంద్రాస్‌పల్లి శివారులో గొండ్యాల్ లిఫ్ట్ పనులు చేపట్టే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీఈ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం డిజైన్ రూపకల్పన పూర్తికావడం జరిగిందన్నారు. ప్రస్తుతం పరిశీలన పూర్తి చేయడం ద్వారా త్వరలో పనులకు టెండర్లు పిలిచి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ లిఫ్ట్ ద్వారా చంద్రాస్‌పల్లి, ఖాజీపూర్, నల్లవల్లి, అనంతపూర్, కోయిలకొండ, ఇబ్రహింనగర్ గ్రామాల చెరువులు గొలుసుకట్టు ద్వారా నిండుతాయన్నారు. సత్వరమే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఈ వెంట జిల్లా నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఆనంద్‌సాగర్, ఈఈ మోహన్‌గౌడ్, డిప్యూటి ఈఈ ఎల్లయ్య, ఏఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.