మహబూబ్‌నగర్

గ్రామాభివృద్ధితోనే అంబేద్కర్ కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 16: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కల సాకారం అవుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండల వేపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో రూ.5లక్షలతో నిర్మించతలపెట్టిన నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో రజక సంఘం భవన నిర్మాణానికి సైతం భూని పూజ చేశారు. మినీ గ్రంథాలయం ప్రారంభించారు. రూ.40 లక్షల వ్యయంతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాల గదులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా వేపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వేపూర్ గ్రామంలో రూ.37 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. హన్వాడ నుండి వేపూర్ గ్రామానికి డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు ఖర్చు చేశామన్నారు. రోడ్డుపూర్తి కావడంతో ప్రజల కష్టాలు తీరాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. అందుకు ప్రజల సహకారం కూడా చాలా అవసరమని అన్నారు. కొందరు నాయకులు కొత్త బిచ్చగాళ్ల మాదిరి గ్రామాల్లో తిరుగుతూ శాంతికి విఘాతం కల్పిస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని పేర్కొన్నారు. రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ప్రజలను మభ్యపెడుతూ గత 60 ఏళ్లుగా పబ్బం గడుపుకున్నారని ఇక వారి ఆటలు సాగవని తెలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. హన్వాడ మండలానికి సాగునీరు తప్పకుండా తీసుకువస్తానని చెప్పారు. హేమసముద్రం రిజర్వాయరును సాధించుకువచ్చి కృష్ణా జలాలను ఇక్కడి రైతుల పొలాల్లో పారించే బాధ్యత తనదేనని అన్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యను తీర్చామని కోయిల్‌సాగర్ నుండి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధ జలాలు అందించామన్నారు. మరికొన్ని గ్రామాలకు త్వరలోనే అందిస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ నాయకులంతా ఏకతాటిపై ఉంటే గ్రామాల్లో తిరుగులేని శక్తిగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, బాలయ్య, ఆనంద్, పెద్ద చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.