మహబూబ్‌నగర్

గణేష్ ఆశయ సాధనకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఏప్రిల్ 16: బలహీన వర్గాల బలోపేతం కోసం అహర్నిషలు కృషి చేసిన కస్తూరి గణేష్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ అన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, గణేష్ కలలు కన్నా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ తెలిపారు. సోమవారం గణేష్ సంతాప సభ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని తెలుగు ముదిరాజ్ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సంతాప సభకు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, బీసీ కమీషన్ సభ్యుడు ఆంజనేయ గౌడ్, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బీఎస్ కేశవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. కస్తూరి గణేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీకీ ఆయన చేసిన సేవలు మరువలేవని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. గణేష్ కుటుంబానికి డబుల్ బెడ్రూంతోపాటు, కుటుంబ సభ్యులకు జీవనోపాధి కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు. అంతకు ముందు బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం అహర్నిషలు కష్టపడుతూ నడిగడ్డలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి గణేష్ అన్నారు. నడిగడ్డలో పెత్తందారి వ్యవస్థను రూపుమాపి గణేష్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. గణేష్ కుటుంబానికి మత్స్య సహకార సంఘం తరపున సహాయ సహకరాలు అందిస్తామని సంఘం నాయకులు హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు, దాతలు గణేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భాస్కర్, ఎంపీపీ సుభాన్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మదుసూదన్‌బాబు, రామలింగేశ్వర్ కామ్లే, అందెబాబు, సంజీవ్, శంకర్, మత్స్యకార సంఘం నాయకులు సత్యనారయణ, నర్సింహ, లక్ష్మన్, దౌలన్న, పాండు పాల్గొన్నారు.