మహబూబ్‌నగర్

కేసీఆర్‌ది నియంత్రృత్వ పోకడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్‌ది నియంతృత్వ పోకడలు అని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారని టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్ష మేరకు మాత్రం పరిపాలన కేసీఆర్ చేయడంలేదన్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో ప్రజలు ఇచ్చిన హామీలను పూర్తి మరిచిపోయారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా పరిపాలన చేస్తున్నందునే రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం కానుందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ జనసమితి కోదండరామ్ నేతృత్వంలో పేరును ప్రకటించి జెండాను కూడా ఆవిష్కరించిందన్నారు. ఈనెల 18న కోదండరామ్ మహబూబ్‌నగర్‌కు రానున్నారని మహబూబ్‌నగర్‌లో తెలంగాణ జనసమితి నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ సభ ఉందని అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వమంటే ఇవ్వకుండా రాజరికంలో ఉన్నామనే విధంగా కేసీఆర్ చూపిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికిని కోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నో మార్లు కోర్టులు మొట్టికాయలు పెట్టిన బుద్ధిరాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు లక్షల ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్ తీరా అధికారంలోకి వచ్చాక కేవలం 17వేలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. తప్పుడులెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై స్పందన లేదని, నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు కావాలని రోడ్లపైకి వస్తుంటే నిర్బాంధాలు సృష్టిస్తూ వారి గొంతు నొక్కే విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నారని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇది రెండవ స్థానంలో ఉందని సిగ్గు చేటని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ముఖ్యమంత్రి ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా తెలంగాణ జనసమితి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బలపడుతుందని ఇందులో సందేహం లేదని అన్నారు. ఇప్పటికే తాము చాలామందితో టచ్‌లో ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని కమీషన్లు లేనిది పని చేయటం లేదని అన్నారు. భవిష్యత్ రాజకీయాలు మాత్రం కేసీఆర్ వర్సెస్ కోదండరామ్‌మే ఉంటుందని అన్నారు. 18న పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభం ఉన్నందునా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా వచ్చి కోదండరామ్‌కు మద్దతుగా నిలిచి తోడ్పాటు అందించాలని అన్నారు. విలేఖరుల సమావేశంలో టీజేఏసీ నాయకులు ప్రభాకర్, బాలకిషన్, నర్సింహా, వెంకటస్వామి, సౌభాగ్య, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.