మహబూబ్‌నగర్

కాంగ్రెస్ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిజ, ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రభుత్వం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ రద్దు చేయడంతో హైకోర్టుని ఆశ్రయించిన ఎమ్మెల్యేకు తీర్పు అనుకూలంగా ఇవ్వడంతో గురువారం అయిజ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తోపాటు, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డిలను ప్రత్యేక వాహనంపై ఊరేగిస్తూ అయిజ ప్రధాన వీధులలో బైక్‌ర్యాలీ నిర్వహించుకుంటూ జై కాంగ్రెస్ అంటూ శ్రేణుల నినాదాలతో అయిజ పట్టణం మారుమోగింది. టీరోడ్డు నుండి పాత బస్టాండు వరకు సాగిన ఈ విజయోత్సవ ర్యాలీలో ఉమ్మడి జిల్లా ప్రతినిధి పోతుల మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు భూంపూర్ నర్సింహరెడ్డి, యూత్ అధ్యక్షుడు లక్ష్మన్న, డీలర్ హనుమన్న తదితరులు పాల్గొన్నారు.

దేవరకద్ర ఎస్‌ఐకి రివార్డు
దేవరకద్ర, ఏప్రిల్ 19: జిల్లా ఎస్పీ డాక్టర్ అనురాధ చేతులమీదుగా దేవరకద్ర ఎస్‌ఐ అశోక్‌కుమార్ రివార్డును అందుకున్నారు. వివిధ కేసులలో పరిష్కారం చూపడంలో చాకచక్యంగా వ్యవహరించి కేసులను పరిష్కరిస్తూ మిస్టరీ కేసులలో కూడా చెందిస్తున్నందున ఎస్సీ అనురాధ ఎస్‌ఐ అశోక్‌కు రివార్డును అందజేశారు. డ్యూటీ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడం, వాహనాల తనిఖీల్లో కూడా అభినందనలు అందాయి.

విద్యుత్‌శాఖలోని ఆర్టిజన్స్‌ను పర్మినెంట్ చేయాలి
- టీవీకేఎస్ జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ అంబాదాస్
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను బేషరతుగా పర్మినెంట్ చేయాలని టీవీకేఎస్ జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ అంబాదాస్ డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌శాఖలో ఆర్టిజన్స్‌గా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని కోర్టు వివాదాల నేపథ్యంలో కౌంటర్‌ను తక్షణం దాఖలు చేయాలని అంతవరకు ఆర్టిజన్స్‌కు సమాన పనికి సమాన వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీస్ రెట్ వర్క్ రద్దు చేసి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌లను చెల్లించి ఉద్యోగ భధ్రత కల్పించాలన్నారు. 3, 4గ్రేడ్ కార్మికులకు ద్వితీయ శ్రేణి ఉద్యోగులకు అందించే వేతనాలను అందించాలని, 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో పనిచేసే గ్యాంగ్ కార్మికులకు గ్రేడ్-1 వేతనాన్ని చెల్లించాలన్నారు. నిరంతర 24గంటల విద్యుత్ సరఫరా నేపథ్యంలో ఇంక్రిమెంట్, 2018 పీఆర్సీలను ఆర్టిజన్స్‌కు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కారుణ్య నియామకం క్రింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐఎఫ్‌టీయూ నాయకులు బి.నర్సింహా, జయపాల్, పాషా, కాశప్ప, గోపి, భీమ్, మిట్టి శివకుమార్, ట్రాన్స్‌కో కార్మికులు, సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.