మహబూబ్‌నగర్

నేర రహిత సమాజానికి కృషి చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ‘పేట’ జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 19: నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు కాకపోయినా ఫరవాలేదు జిల్లాలో ఉంటే అన్ని సదుపాయాలు, సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిలు ఇచ్చిన హామీలను విస్మరించారని జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్ ఆరోపించారు. గురువారం నారాయణపేటలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలని బలమైన ఉద్యమాలు నడిచిన సమయంలో ప్రభుత్వం చిన్న చిన్న ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయగా ఆందోళనలు తీవ్రం కావడంతో జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి తదితరులు పేట జిల్లా కాకపోయినా జిల్లాలో ఉండే అన్ని సదుపాయాలు కల్పించి జిల్లా హోదా కల్పిస్తామని హామీలు ఇచ్చి వాటిని విస్మరించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నారాయణపేటకు సైనిక్ స్కూల్ వస్తుందో రాదో అన్న విషయం కూడా అధికారపార్టీ నేతలకే స్పష్టత లేదన్నారు. నారాయణపేట మండలం పేరపళ్లలో ఉన్న జాయమ్మ చెరువుకు సంగంబండ బ్యాక్ వాటర్ ద్వారా నీరందిస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబందించి జిఓ నెం.69ని అమలు చేస్తామని చెప్పి దానిని పక్కన పెట్టేశారని, జిల్లా ఆసుపత్రిని ఇస్తామని చెప్పిన మంత్రి మాట కేవలం మాటలకే పరిమితమైందని, చేతల్లో మాత్రం కనిపించడం లేదన్నారు. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు వెంకట్రామిరెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు రఘువీర్‌యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుధాకర్, టీడీపీ జిల్లా నాయకులు ఓంప్రకాశ్, ఎంఐఎం నాయకులు గులాం మైనోద్దీన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా నాయకుడు కాశీనాథ్, బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకోబా, జమాతే ఇస్లామి హింద్ నాయకులు ముజాహిద్ సిద్దికీ, గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 19: సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రిస్తూ నేర రహిత సమాజం కోసం కృషి చేద్దామని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశం హాల్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా వ్యవహరిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం సిబ్బంది పనిచేసేలా చూడాలని అన్నారు. పోలీస్ శాఖలోని సాంకేంతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ సులభతరమవుతుందన్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని వారిలో మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలన్నారు. సమాజానికి తగ్గట్టుగా మనం కూడా సాంకేతికంగా ముందుకు పోవాలన్నారు. ఇందుకోసం ప్రస్తుతం పోలీస్ శాఖకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని నేరాలను తగ్గిస్తూ నేర రహిత సమాజం కోసం కృషి చేద్దామన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయడంలో కోర్టు అధికారులతో సమన్వయం పాటించాలని అన్నారు. ఎప్పటికప్పుడూ పైఅధికారుల సలహాలు తీసుకుంటూ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు, సిబ్బందికి రివార్డులిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న నేరాల పట్ల ప్రత్యేక దృష్టిని ఉంచుతూ నిర్ధిష్ట లక్ష్యం పెట్టుకొని పనిచేయాలన్నారు. నమోదైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడూ సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలని, విచారణ అధికారులు ఎవరికి వారు సొంతంగా విచారణ చేసి క్వాలిటీ ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌ను పెంచేందుకు సాంకేతికతను జోడిస్తూ నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీ ఎస్పీలు లక్ష్మీనారాయణ, ఎల్సీ నాయక్, శ్రీనివాస్‌లతో పాటు సీఐ శ్రీనివాస్‌లు, రామకృష్ణ, గిరికుమార్‌లతో పాటు ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.