మహబూబ్‌నగర్

ఆధునిక పరిజ్ఞానంతో కేసుల పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19: పోలీసుశాఖలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరువలన పరిశోధనలో వేగం, సాక్షాధారాల నిర్ధారణ ఎంతో మెరుగైందని ఎస్పీ అనురాధ అన్నారు. గత రెండురోజులుగా జరిగిన కేసుల పరిష్కార సదస్సు ముగింపు సమావేశం గురువారం పూర్తి చేసుకుందని ఎస్పీ వెల్లడించారు. ఈసందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ కేసులు నమోదు చేయడం నుండి పరిశోధన పూర్తి చేసి న్యాయస్థానంలో నిందితుడికి శిక్ష ఖరారయ్యేదాక దర్యాప్తు అధికారి తీసుకునే శ్రద్ధ, బాధితులకు న్యాయం చేకూర్చి ఓదార్పునిస్తుందన్నారు. ముఖ్యంగా యూఐ పరిశోధనలో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయడం వల్ల పోలీసుశాఖకు మంచిపేరు లభిస్తుందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు కేసుల దర్యాప్తులో వేగం పెంచుతూ ఒక్క ఏప్రిల్‌లోనే 152 కేసుల పరిశోధనను జిల్లా పోలీసు అధికారులు పూర్తి చేయడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విశేష కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ రికార్డులను అందజేశారు. ప్రజల నుండి లభించే అభినందనలు, పోలీసుశాఖ నుండి అందే రివార్డులు మన నిత్యజీవితానికి స్ఫూర్తి కలిగించడమే కాక ఎంతో ఆత్మసంతృప్తిని అందిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, శ్రీ్ధర్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

దళితుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
* కలెక్టర్ రోనాల్డ్ రోస్
దామరగిద్ద, ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నిరంతరంగా పనిచేస్తుందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఉడుమల్‌గిద్ద గ్రామంలో గ్రామ అసైండ్ భూముల అభివృద్ధి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. సందర్భంగా గ్రామంలో గతంలో 150 ఎకరాల అసైండ్ భూములను దళితులకు పంపిణీ చేశారు. భూములు చదునుగా లేకపోవడంతో గుట్ట ప్రాంతంలో ఉండగా దళిత రైతులు సాగుచేయడానికి తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. భూములను చదును చేయడానికి ఉపాధిహామీ పథకంలో భాగంగా పట్టాలు పొందిన రైతులు కొంత ఆర్థిక సాయం చేసుకుని కలెక్టర్ చేతుల మీదుగా భూముల చదునును ప్రారంభించారు. గుట్ట ప్రాంతంలో ఉన్న భూములను స్వయంగా 4కిలో మీటర్ల పాటు ట్రాక్టర్‌పై, సైకిల్‌మోటార్‌పై తిరుగుతూ భూములను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడే ఉన్న ద్వామా పీడీకి ఉపాధిహామీ పథకంలో భూములను చదునుచేసి దళితులు పంటలు పండించుకునే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ పట్టాలు పొందిన దళిత రైతులు భూములు చదును అయిన తర్వాత పంటలు వేసి అధిక మొత్తంలో పంట దిగుబడి చేసి లాభాలు పొందాలని సూచించారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులను వాడి పంటలను పండించుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికి వివిధ రంగాల్లో నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. స్పందించిన కలెక్టర్ గ్రామంలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు ఎన్ని నిర్మించారని సర్పంచు, గ్రామ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. 100శాతం ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం లేకపోవడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి వివిధ రంగాల్లో గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓ సందీప్‌కుమార్, తహశీల్దార్ బాలాజీ, వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, సర్పంచు గౌరయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.