మహబూబ్‌నగర్

రాష్ట్రంలోనే ఫస్ట్ క్రై కిట్ పథకం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గతంలో సర్కారు దవాఖానకు నేను రానుబిడ్డ అనే పాటలను విన్నామని కానీ ప్రస్తుతం సర్కారు దవాఖానలోనే వైద్యసేవలు తీసుకుంటామనే విధంగా ప్రజల్లో మార్పు తీసుకువచ్చామని అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఫస్ట్‌క్రై కిట్ పథకాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పసికందుకు కావల్సిన సామాగ్రిని ఈ కిట్ ద్వారా అందజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ చొరవతో ఈ కిట్ మహబూబ్‌నగర్ ఆసుపత్రి నుండే శ్రీకారం చుట్టారు. అయితే పలు స్వచ్ఛంద సంస్థలు ఈ కిట్‌కు సహకారం అందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పేద ప్రజలు కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదని తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రూపాంతరం చెందాయని తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవమేనని త్వరితగతిన రిక్యూట్‌మెంట్ కూడా జరుగనుందని అన్నారు. ఫస్ట్ క్రై కిట్ కేసీఆర్ కిట్ తరహాలో ఉంటుందని దాదాపు రూ.200లకు సంబంధించిన వస్తువులు ఉంటాయని తెలిపారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిగా తయారు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎయిమ్స్ ఇక్కడికి రాకున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాత్రం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో వైద్యసేవలు తీసుకునేలా ఇక్కడికి వచ్చేలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ రజిని, డాక్టర్ శశికాంత్, శ్రీనివాస్‌రాజ్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతు పక్షపాతిగా ప్రభుత్వం
- ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గువ్వల
అచ్చంపేట, ఏప్రిల్ 21: రైతుబంధు పథకం ద్వారా పంటకు పెటుటబడిగా రైతులకు చేయుతను అందించి రైతు పక్షపాతిగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక మార్కెట్ యార్డులో కమిటీ చైర్మన్ పోశం జయంతితో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే అందరు సంతోషంగా ఉంటారన్నాయి. సీఎం కేసీఆర్ భావించి రైతుల మేలు కోసం పలు పథకాలను ప్రవేశ పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.