మహబూబ్‌నగర్

ఊరించి ఉసూరు మనిపించిన ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, ఏప్రిల్ 21: నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నియామక విషయంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు. అయితే తమకే దక్కుతుందన్న ధీమాతో ఉన్న ఆశావాహులు మాత్రం నిరాశలో మునిగి తేలుతూ ఎమ్మెల్యేను కాదనలేక పార్టీనీ వీడలేక తప్పని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నారాయణపేట మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్ పదవీకాలం గత ఫిబ్రవరి 27న ముగియగా అప్పటి నుండి ఎవరికీ అదనపు బాధ్యతలు అప్పగించకుండా ప్రభుత్వం పాలన సాగించింది. అయితే దీనిని అవకాశంగా మార్చుకున్న పలువురు ఎమ్మెల్యే సన్నిహితులు ఎలాగైనా మార్కెట్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు తమదైన శైలిలో ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగారు.
అయనా ఎమ్మెల్యే ఆశీస్సులు లేకపోవడంతో నారాయణపేట మార్కెట్ కమిటీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పరిపాలనా విభాగానికి సంబంధించి ఏడీఏను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంతకాలం తమకంటే తమకంటూ భుజాల తడుముకున్న నేతలకు ఎమ్మెల్యే అనుగ్రహం తమకు లేదని అర్థమైపోయంది. దీంతో ఈ పదవిని ఆశించిన పలువురు నాయకులు తీవ్ర నిట్టూర్చారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన అనంతరం టీఆర్‌ఎస్ చేరిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తనవెంట వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నారనే ప్రచారం సాగినా తదనంతర పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారంటూ పలువురు టీడీపీ నుండి ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని పార్టీలో ఉన్నా తాము ఎమ్మెల్యేకు ఎలాంటి విషయాన్ని చెప్పలేని దుస్థితి నెలకొందని పలువురు బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టీజేఎస్ ఆవిర్భావ సభకు ముమ్మర ప్రచారం
- మార్కింగ్ వాకర్లతో ముఖాముఖి బేటీలు
- -29న జరిగే సభకు తరలిరావాలంటూ జేఏసీ నేతల విజ్ఞప్తి
- పార్టీ ఏర్పాటుకు దారి తీసిన అంశాలను వివరిస్తూ ప్రచారం
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు జనాన్ని తరలించేందుకు జిల్లాకు చెందిన జేఏసీ నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల, స్టేడియం మైదానం, ఎర్ర సత్యం కాలినీ మైదానం, మెట్టుగడ్డ మైదానంలో ఉదయం టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆవిర్భావ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలంటూ ప్రచారం చేశారు. వాకర్లతో బేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ పాత్ర మరువలేనిదని అలాంటి నాయకుడికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 29ను జరిగే సభకు కేవలం మహబూబ్‌నగర్ పట్టణం నుండే దాదాపు 1500 మందికి పైగా తరలించాలని జేఏసీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కోదండరామ్ పార్టీ ఏర్పాటుకు దారి తీసిన అంశాలను వాకర్లకు తెలియజేస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా ఉదయనే్న కొందరి ప్రముఖులతో సైతం కోదండరామ్‌తో ఫోన్లలో మాట్లాడించే ప్రయత్నాలను కూడా చేస్తుండడంతో ప్రచారానికి మరింత స్పందన లభిస్తోంది. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దాదాపు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున్న జనాన్ని తరలించాలని కూడా జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి పలువురితో సంప్రందిపులు మొదలుపెట్టారు. ముఖ్యంగా రిటైర్డు ఉద్యోగులను ఈ సభకు ఎక్కువగా తరలించి పార్టీ ఉద్దేశాన్ని ముందుగా ఇలాంటి వారికి తెలియజేయాలని కూడా ప్రయత్నంలో ఓ అంశం అని చెబుతున్నారు. కాగా ఈనెల 29న జరిగే తెలంగాణ జనసమితి బహిరంగ సభకు యువతను తరలించి టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయించాలనే ఉద్దేశం కూడా టీజేఏసీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. శనివారం ఉదయం వాకర్లతో జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిందని అయితే ప్రజలు ఏ ఆకాంక్షలతో తెలంగాణను చూడాలనుకున్నారో ఆ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేయడం లేదు కాబట్టే తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం తప్పడంలేదని అన్నారు. ఉద్యమ ద్రోహులకు పాలనలో పెద్దపీట వేస్తూ అలాంటి వారు అవినీతి అక్రమాలకు పాల్పడటానికి టీఆర్‌ఎస్ పార్టీయే కారణమని అన్నారు. 29న హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌లో జరిగే బహిరంగ సభకు మహబూబ్‌నగర్ హాజరుకావాలని ఆయన కోరారు.