మహబూబ్‌నగర్

ప్రభుత్వ ఆసుప్రతుల్లో కార్పొరేట్ తరహా వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో రూ.1.50 కోట్లతో డిజిటల్ రేడియోగ్రామ్ వ్యవస్థను ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాంలో ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుప్రతులు అంటే ప్రజలు భయపడేవారని కానీ ప్రస్తుతం ప్రజలు తమ వైద్యం పట్ల ప్రభుత్వ ఆసుప్రతులే మేలని భావిస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక వైద్యశాఖలో ఎన్నో మార్పులు వచ్చాయని దాంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం దాదాపు రెండు కోట్ల వ్యయంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో డిజిటల్ రేడియో గ్రామ్ వ్యవస్థను తీసుకువస్తున్నామన్నారు. ఇంకా మంచి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం మరిన్ని పరికరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గతంలో పాలకులు ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోలేదని ప్రైవేట్ ఆసుపత్రులే మేలనే విధంగా పాలకులే ప్రచారం చేసేవారని ఆరోపించారు. కానీ ప్రస్తుతం తెలంగాణ స్వరాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఉద్యనేత కేసీఆర్ సీఎం కావడం ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌కు మెడికల్ కళాశాల రావడం కూడా మంచి పరిణామమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా పనులు జరగాల్సి ఉందని వాటిని కూడా ప్రభుత్వం పూర్తి చేయనుందన్నారు. డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు. మున్నుందు ప్రతి ఆసుపత్రిలో ఖాళీల భర్తి తప్పకుండా జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సూపరిండెండెంట్ రాంకిషన్, అధికారులు సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.