మహబూబ్‌నగర్

విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మైనార్టీ గురుకుల విజిలెన్స్ అధికారి గులాం హుస్సేన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకులం-2లో ఈనెల 12 నుండి జరిగిన బాలికల వేసవి క్రీడా శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈసందర్భంగా గురుకులం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులాం హుస్సేన్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ మైనార్టీ గురుకులాల్లో నాణ్యమైన చదువుతోపాటు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. బాలికలకు క్రీడల్లో ప్రొత్సహించడం కోసం వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆటల్లో రాణించే బాలికలకు రాష్టస్థ్రాయి శిక్షణకు పంపిస్తామన్నారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో బాలికలకు కింగ్‌షోటోకాన్ క్లబ్ ఫౌండ్ జహంగీర్‌పాష ఖాద్రి ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అందజేశారు. ముగింపు కార్యక్రమంలో బాలికలకు ప్రదర్శించిన కరాటే మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కడుపుపై బండరాయిని పగులగొట్టడం, మోటర్‌బైక్‌ను చేతివేళపై నడిపించడంతో పాటు కత్తితోజూడో విన్యాసాలు చేసి అబ్బురపరిచారు. ఇటివలే శిక్షణ శిబిరంలో బాగంగా నిర్వహించిన కరాటే పోటీల్లో గ్రాండ్ చాంపియన్‌షిప్ పొందిన అఫ్రిన్, ప్రతిభ చాటిన సమీన, నేహ, మాహిన్, ప్రసన్న, మనీషాలకు మెడల్స్ అందజేశారు. మిగితా 10మందిని సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుకులాల కో-ఆర్టినేటర్ రాములు, మైనార్టీశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఫరిదాజబీన్, క్లబ్ మాస్టర్లు జహంగీర్‌పాష ఖాద్రి, కోశాధికారి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.