మహబూబ్‌నగర్

ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, ఏప్రిల్ 26: ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులను రెండు నెలల్లోపు అర్హులందరికి అందజేస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి వెల్లడించారు. గురువారం మండల పరిధిలోని మాందాపురంలో బిల్లులు అందని ఇందిరమ్మ ఇండ్లను ఆమె పరిశీలించారు. ఈసందర్బంగా శే్వతా మహంతి మాట్లాడుతూ జిల్లాలో 3071 ఇందిరమ్మ ఇండ్లకు గాను అందులో 632 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశామన్నారు. పెండింగ్ లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బడ్జెట్ వచ్చిన వెంటనే బిల్లుల చెల్లింపు జరుగుతుందని తెలిపారు. పాన్‌గల్ మండలంలో 546 ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే మే 10 నుండి గ్రామాల్లోని రైతులకు ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడుల సాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఆధార్‌నెంబర్లు ఇవ్వని రైతులకు పెట్టుబడుల సాయం అందదని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 29 నుండి పీపీబీ స్లిప్‌లను గ్రామాల్లో రైతులకు అందజేస్తామన్నారు. పెట్టుబడి సాయం అందని రైతుల వివరాలను ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద జాబితాను అతికిస్తామన్నారు. పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో అందిస్తునందున రైతులు సంయమనం పాటించి తీసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం గ్రామంలోని వీరన్న చెరువు వెనుక గల ఇసుక వాగును ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచు జయరాములుసాగర్, బుసిరెడ్డిపల్లి సర్పంచు వెంకటయ్యనాయుడు, ఎంపీటీసీ లత, పీఆర్ ఈఈ శివకుమార్, డీఈ చెన్నయ్య, ఏఈ సత్తయ్య, తహశీల్దార్ ఆలెగ్జాండర్, ఎంపీడీవో రెడ్డయ్య, ఆర్‌ఐ బాల్‌రాంనాయక్, వీఆర్వో ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి మధుగౌడ్ పాల్గొన్నారు.