మహబూబ్‌నగర్

భానుడి భగభగలు...పెరిగిన ఉష్టోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఏప్రిల్ 28: భానుడి ఉష్టోగ్రతలతో రోడ్లన్ని నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సూర్యతాపంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలోనే గురువారం మక్తల్ పట్టణంలోని యునైటెడ్ వెల్డింగ్ వర్క్స్, తిరుమల ఆటోమోబైల్‌కు చెందిన హఫీజ్, మాడపల్లి అంజయ్య, జుబేర్‌లు సూర్యుని తాపాన్ని పరీక్షించారు. ఇందులో భాగంగా వారు ఓ వెల్డింగ్ రేకును ఇనుప చువ్వలపై పెట్టి రెండు గుడ్లను కలిపి పేనం రేకుపై పోసిన మరుక్షణమే ఆమ్లెట్ తయారైంది. దాదాపు 42 డిగ్రీల ఉష్టోగ్రత ఉండటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని వారన్నారు. వెల్డింగ్ పనులు చేయాలంటే వేడిమికి తట్టుకోలేక పోతున్నామని హఫీజ్, జుబేర్, మన్నన్‌లు వాపోయారు. గత 15 సంవత్సరాలుగా తాము వెల్డింగ్ పనులు చేస్తున్నప్పటికి ఇంతటి వేడిమి ఎన్నడు చూడలేదని తెలిపారు. ఉదయం ఎనిమిది దాటితే తాము పనులు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని వారు వాపోయారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి నెలకొంది మే నెలలో ఇంకా నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉందని, అధిక ఉష్టోగ్రతలకు తాము కొత్త వెల్డింగ్ పనులు తీసుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.