మహబూబ్‌నగర్

రైతుబంధు రైతుకు ఆత్మబంధువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, మే 17: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకం రైతుబంధు రైతుకు ఆత్మబంధువు అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందివడ్డెమాన్‌లో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతుబంధు చెక్కులు బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవచ్చన్నారు. డబ్బులను ఇతరాత్ర అవసరాలకు వాడుకోకుండా వ్యవసాయ పెట్టుబడికే వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయంకు సాయం అందక ఎన్నో అష్టకష్టాలు పడ్డామని, స్వరాష్ట్రంలో ఆ కష్టాలు లేకుండా 24 గంటల కరెంటు, సరిపడా ఎరువులు, సాగునీరు సమృద్ధిగా రైతుకు అందిస్తూ పంట పెట్టుబడి కోసం సంవత్సరానికి రూ.8వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దీనిని వినియోగించుకొని రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ ఎద్దుల రాములు, మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ కుర్మయ్య, ఎంపీటీసీ యాదగిరి, మలిశెట్టి వెంకటస్వామి, శ్రీకాంత్‌రావు, శివయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు వరం రైతుబంధు
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
పెబ్బేరు, మే 17: రైతుబంధు పథకం రైతుల పాలిట వరం అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండల పరిధిలోని తాటిపాముల గ్రామంలో చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బృహత్తర ప్రణాళికాలో భాగమైన రైతుబంధు పథకం పెట్టుబడికి ఆసరాగా ఉండి రైతుకు వ్యవసాయంపై మక్కువ పెంచుకునే విధంగా మారిందన్నారు. రైతుల కళ్ళలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. రాబోయే రోజులో రైతులకు కుటీర పరిశ్రమలు చేదోడుగా ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. అంతకు ముందు చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమానికి స్వాగతం పలికేందుకు ఎద్దుల బండిపై ఊరేగింపు చేపట్టారు. అనంతరం చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గౌని కోదండరాంరెడ్డి, సర్పంచు బజరన్న, నవీన్‌కుమార్‌రెడ్డి, యోగానందరెడ్డి, ఎంపీపీ పద్మావతి, గౌడనాయక్ పాల్గొన్నారు.
రంగాపూర్‌లో చెక్కులు పంపిణీ చేసిన నిరంజన్‌రెడ్డి
పెబ్బేరు మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో రైతులకు చెక్కులు, పాస్‌పుస్తకాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గౌని బుచ్చారెడ్డి, కోదండరాంరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.