మహబూబ్‌నగర్

రైతుబంధును పెట్టుబడికే ఉపయోగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, మే 17: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం వల్ల పంటకు పెట్టుబడికి ఉపయోగపడుతుందని, రైతులు తమకు వచ్చిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు పథకం రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ కేశవులు అన్నారు. రైతులు తమకు వచ్చిన డబ్బులను దుర్వినియోగం చేయకుండా పంటలకు కావలసిన ఎరువులు, విత్తనాలకు వినియోగించుకోవాలని సూచించారు. గురువారం మల్దకల్ మండలం ఎద్దులగూడెం గ్రామంలో జరిగిన రైతుబంధు పంపిణీ పరిశీలించి రైతులకు చెక్కులు, పాస్‌పుస్తకాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. ఏ రైతు చెక్కులు రాలేదని నిరాశ పడవద్దని, ప్రతి రైతుకు చెక్కులు అందజేస్తామన్నారు. మొదటి దశలో కొన్ని, రెండవ దశలో కొన్ని పాస్‌పుస్తకాలు, చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. పాస్ పుస్తకాల్లో, చెక్కుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, ఇందుకు ప్రత్యేకంగా ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రైతులు నేరుగా బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు ఎలాంటి అప్పులు చేయకుండా పంటలు పండించుకునే వీలుంటుందన్నారు. ఇప్పటికీ 8 జిల్లాలలో పర్యటించానని, చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ అంతటా సజావుగా సాగుతున్నదని వెల్లడించారు. జేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా టీంలు తయారు చేసి చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ జరుగుతుందన్నారు. చెక్కులు, పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఈనెల 20వ తేదీ తర్వాత సవరించే ప్రక్రియ ప్రారంభంమవుతుందన్నారు. అనంతరం మల్దకల్‌లోని ఆదిశిలా క్షేత్రంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువ, తీర్థప్రసాదాలతో సత్కరించి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ బండ్ల లక్ష్మిదేవమ్మ, ఎంపీపీ సవారమ్మ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ తిమ్మారెడ్డి, తహశీల్దార్ వీరభద్రప్ప, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్, టీఆర్‌ఎస్ నాయకులు సీతారామిరెడ్డి, మహబూబ్‌అలీ, వెంకటన్న, ఆంజనేయులు, ఎస్‌ఐ నవీన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

అక్షరంతోనే అణగారిన వర్గాల్లో వెలుగులు
* ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్
చారకొండ, మే 17: చదువుతోనే బహుజనుల జీవితాల్లో వెలుగులని, దళితులకు విద్యను సులభతరం చేసేందుకే సైకిల్ యాత్రను ప్రారంభించినట్లు ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 25న ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రారంభమైన సైకిల్‌యాత్ర నల్లగొండ జిల్లాలో ముగించుకొని గురువారం మండల కేంద్రానికి చేరింది. ఈసందర్భంగా భారతరత్న డా.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాలర్పించారు. అనంతరం ఏర్పాటు చేపిన సమావేశంలో మాట్లాడారు. చదువుకునే స్థోమత లేక దళితులు విద్యకు దూరంగా ఉన్నారని అలాంటి వారి బతుకులో వెలుగు రావాలంటే దళితులకు ప్రత్యేక ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని, అభివృద్ధి పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దళితులకు మూడెకరాల భూమి, రెండు పడకల గదుల ఇళ్ళు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 24న హైదరాబాదులో అక్షర చైతన్య మహాసభ నిర్వహిస్తున్నామని సభకు దళితులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యాత్రలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు చింతల శ్యాం మాదిగ, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు కొలూరి వెంకట్, వర్కంగ్ ప్రెసిడెంట్ శంకర్, కార్యదర్శి ముదిగొండ ఎల్లేష, మండల నాయకులు గ్యార లక్ష్మన్, మల్లిఖార్జున్, బారీమ్ తదితరులు పాల్గొన్నారు.